Karnataka HC Refuses To Quash FIR Registered Against Actor Chetan Kumar - Sakshi
Sakshi News home page

Kantara Movie- Chethan Kumar: కాంతారపై సంచలన వ్యాఖ్యలు, కేసు నమోదు.. నటుడికి షాకిచ్చిన కోర్టు

Published Sat, Dec 10 2022 11:38 AM | Last Updated on Sat, Dec 10 2022 1:22 PM

Karnataka HC Refuses To Quash FIR Registered Against Actor Chetan Kumar - Sakshi

‘కాంతార’ మూవీతో సంచలన వ్యాఖ్యలు చేసిన కన్నడ నటుడు చేతన్‌ కుమార్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.  ఈ కేసులో చేతన్‌ కుమార్‌కు బెంగళూరు హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసు దర్యాప్తు దశలో ఉండగా దానిని ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. వివరాలు.. కాంతార సినిమాలో భూతకోల సంస్కృతిని డైరెక్టర్‌, హీరో రిషబ్‌ శెట్టి అద్భుతంగా చూపించాడు. ఈ సంస్కృతికి దేశవ్యాప్తంగా ప్రేక్షకులంత ఫిదా అయ్యారు. 

అయితే ఈ సంస్కృతి హిందూ మతంలో భాగం కాదంటూ కన్నడ నటుడు చేతన్‌ కుమార్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. చేతన్‌ కుమార్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శివ కుమార్‌ అనే వ్యక్తి శేషాద్రినగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చేతన్‌ కుమార్‌ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టెల ఉన్నాయని, హిందూ మనోభవాలను దెబ్బతీసేశాల అతడు వ్యవహరించాడంటూ శివకుమార్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చేతన్‌ కుమార్‌ను కోర్టులో హాజరుపరిచారు.

 నిన్న ఈ కేసుపై విచారణ చేపట్టగా తాను కేవలం తన అభిప్రాయం మాత్రమే వ్యక్తం చేశానని, హిందూ మతాన్ని కించపరిచే విధంగా తన వ్యాఖ్యలు లేవంటూ కోర్టులో వాధించాడు. అదే విధంగా.. తాను ఏ మతాల మద్య విద్వేషాన్ని రెచ్చగొట్టలేదని వివరణ ఇచ్చాడు. అయితే కోర్టు ఈ కేసు విచారణ వాయిదా వేసింది. ఒక మత సంస్కృతిని కించ పరిచే విధంగా మాట్లాడటం.. మతాల మద్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల విషయంలో చేతన్‌పై నమోదు చేసిన ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉండగా అడ్డుకోలేమని హైకోర్టు పేర్కొంది. 

చదవండి: 
హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న అజిత్‌ రీల్‌ కూతురు బేబీ అనిఖా
మహేశ్‌ బాబు భార్య నమ్రత కొత్త రెస్టారెంట్‌, మెను, రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement