![Hyderabad Woman Shweta Reddy Insults Panjurli Daiva by doing cinema reels - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/5/swetha.jpg.webp?itok=J3XDJKTu)
పంజిని వేషంలో..., ధర్మస్థలకు వచ్చిన యువతి
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): కాంతార సినిమా తరహాలో పంజర్లి దేవుడి వేషం వేసి రీల్స్ చేసి తుళునాడు (కొడగు) ప్రజల ఆక్రోశానికి గురైన హైదరాబాద్‌కు చెందిన మేకప్ ఆర్టిస్ట్ శ్వేతారెడ్డి ధర్మస్థల మంజునాథస్వామి సన్నిధిలో క్షమాపణలు కోరారు.
వరాహ రూపంలో పాటకు రీల్స్ చేయటానికి యువతి చేతిలో పంజనం పట్టిన రూపంలో రంగులు వేసి రీల్స్ చేసి సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. దీనిపై నెటిజన్లు ఆక్షేపం వ్యక్తం చేశారు. కొందరు ధర్మస్థల మంజునాథస్వామి శిక్షిస్తాడంటూ శాపనార్థాలు పెట్టడంతో శ్వేతారెడ్డి శుక్రవారం మంజునాథస్వామి సన్నిధిలో కొడగు ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ధర్మస్థల ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ వీరేంద్రహెగ్డేని కలిసి క్షమాపణలు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment