Swetha Reddy
-
తప్పయింది క్షమించండి: మేకప్ ఆర్టిస్ట్ శ్వేతారెడ్డి
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): కాంతార సినిమా తరహాలో పంజర్లి దేవుడి వేషం వేసి రీల్స్ చేసి తుళునాడు (కొడగు) ప్రజల ఆక్రోశానికి గురైన హైదరాబాద్‌కు చెందిన మేకప్ ఆర్టిస్ట్ శ్వేతారెడ్డి ధర్మస్థల మంజునాథస్వామి సన్నిధిలో క్షమాపణలు కోరారు. వరాహ రూపంలో పాటకు రీల్స్ చేయటానికి యువతి చేతిలో పంజనం పట్టిన రూపంలో రంగులు వేసి రీల్స్ చేసి సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. దీనిపై నెటిజన్లు ఆక్షేపం వ్యక్తం చేశారు. కొందరు ధర్మస్థల మంజునాథస్వామి శిక్షిస్తాడంటూ శాపనార్థాలు పెట్టడంతో శ్వేతారెడ్డి శుక్రవారం మంజునాథస్వామి సన్నిధిలో కొడగు ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ధర్మస్థల ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ వీరేంద్రహెగ్డేని కలిసి క్షమాపణలు కోరారు. చదవండి: (జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. భార్య, కన్నబిడ్డను..) -
కరోనా వైద్యం పేరుతో 29 లక్షలు...
సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని చార్మినార్ డివిజన్ మేహిదీపట్నం సిటివో సర్కిల్–2 లో ఏసిటీవోగా విధులు నిర్వహిస్తున్న శ్వేతా రెడ్డి మృతి పై సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గేజిటేడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. గ్రూప్ 2 అధికారిని శ్వేతా రెడ్డి మృతికి కారణమైన కార్పోరేట్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ తోటి ఉద్యోగిని కోల్పోవడం చాలా బాధాకరం విషయం అని అన్నారు. కాన్పు కోసం అని శ్వేతా రెడ్డి భర్త హైదరాబాద్‌లోని కార్పోరేట్ ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా అక్కడ తనకు మగ బిడ్డ పుట్టినట్లు వైద్యులు చెప్పినట్లు తెలిపారు. నాలుగు రోజుల తర్వాత ఆయాసం రావడంతో కరోనా పరీక్షలు జరిపి ఫలితాలు చూపకుండానే బాధితురాలికి కరోనా పాజిటివ్ అని చెప్పి లక్షలలో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. (కోవిడే మన కొంప ముంచిందా?! ) 20 రోజులు ఐసియూలో ఉంచి సుమారు 29 లక్షలు వసూలు చేయటం హేయమైన చర్య అన్నారు. మృతురాలి భర్త మాధవరెడ్డి తన భార్యను చూస్తానని పట్టు బట్టడంతో చూపించారని, తన భార్య పరిస్థితి చూసి అనుమానంతో ఇతర వైద్యుల అభిప్రాయం తీసుకుంటాను రిపోర్టులు ఇవ్వమని గట్టిగా నిలదీయడంతో మరుసటి రోజు గుండెపోటుతో చనిపోయినట్లు ప్రకటించారన్నారు. శ్వేతా రెడ్డి మృతి పై సమగ్ర విచారణ జరిపించి ,కారణమైన కార్పోరేట్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే శ్వేతారెడ్డి మరణానికి ప్రైవేటు ఆస్పత్రి కారణం అయి ఉంటుందని మహ్మద్ మజాహిద్ హుస్సేన్ ఆరోపించారు. (ఏడేళ్ల క్రితం స్పెర్మ్‌తో పండంటి బిడ్డ) ‘శ్వేతారెడ్డి ఎలా మరణించిందో చెప్పమంటే చెప్పకుండా దాటేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా తెలియడంతో ఆస్పత్రి యాజమాన్యం బేరసారాలకు దిగింది. సిజేరియన్ ఆపై కరోనా అని చెప్పి 29 లక్షలు దోపిడీ చేసి గుండెపోటుగా చిత్రించడం ఎంత దారుణమో రాష్ట్ర ప్రజలు ఆలోచించి ప్రశ్నించాలి. గ్రూప్ 2 అధికారిని శ్వేతారెడ్డి కుటుంబాన్ని దారుణంగా దోచుకుని మరణానికి కారణమైన ప్రైవేటు యజామాన్యం ఇంతకు ముందు నుంచి ఇదే వ్యాపార ధోరణీతో వేలాదిమంది పేద ప్రజలకు తప్పుడు రోగాలు అంటగట్టి లక్షలు దోచుకుంటున్నదని ప్రజలు ఎంత గగ్గోలుపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు.ఇటీవల కరోనా కారణంగా ఇదే ఆస్ప్రత్రిపై వేలాది పిర్యాదులు ఇటు రాష్ట్రప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన కూడా కేవలం కేంద్రం స్పందించి నోటీసులు ఇచ్చింది. అయిన యాజమాన్యంలో మార్పు రాలేదు కదా ఇంకా దారుణంగా దోచుకుంటున్నది. (రోజు పది మందే చనిపోతున్నారా?: హైకోర్టు) ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రజల పిర్యాదులతో డెక్కన్ హాస్పిటల్స్, విరించి హాస్పిటల్స్ చర్యలు తీసుకున్నది కానీ అంతకన్నా ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన ఆ ఆస్పత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఒక గ్రూప్ 2 అధికారినినే ఇంత దారుణంగా మోసం చేస్తే చదువుకొని కుటుంబాలకు ఎంత దోచుకుంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలి? ఇంకా ఆలోచిస్తే అసలు యశోదాలో ఏం జరుగుతుందో కేంద్ర స్థాయి దర్యాప్తు జరుపాల్సిన అవసరం ఉంది. ఏమైనా బహుళజాతి ఫార్మా కంపెనీల ప్రయోజనం కోసం ఏమైనా ప్రయోగాలు చేస్తున్నారా? ఎందుకు యశోధ హస్పిటల్స్ లోనే ఏళ్ల తరబడి ఈ విధంగా జరుగుతుంది. వెంటనే రాష్ట్ర ప్రజల బాగుకోసం తెలంగాణ ప్రభుత్వం యశోధ హాస్పిటల్స్ ని నిషేధించి యాజమాన్యం ఆస్తులను స్వాధీనం చేసుకోని దర్యాప్తు జరపాలి.’ అని డిమాండ్ చేశారు. -
‘బిగ్‌బాస్’ను వదలను: శ్వేత
సాక్షి, హైదరాబాద్: రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ ప్రసారాలను నిలిపివేసేంత వరకు తన పోరాటం ఆగదని జర్నలిస్టు శ్వేతా రెడ్డి అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నటి గాయత్రి గుప్తా, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్యతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. సినిమా తరహాలో బిగ్‌బాస్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోందని ఆరోపించారు. మహిళల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా షోలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తాను చేస్తున్న పోరాటానికి ఇప్పటికే పలు సంఘాల మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు కూడా తన పోరాటానికి మద్దతు తెలిపారన్నారు. సినిమా రంగంలో ఎంతో గౌరవం ఉన్న అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించడం సరికాదన్నారు. తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టి మార్పులు తీసుకువస్తానని ప్రకటించిన విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా తమిళ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24, 25 తేదీల్లో తమిళనాడుకు వస్తున్నారని, తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త రాజేశ్వరి ప్రియతో ప్రధానిని కలిసి ‘బిగ్‌బాస్’పై వినతిపత్రం సమర్పిస్తామని శ్వేతా రెడ్డి తెలిపారు. ‘బిగ్‌బాస్’ను నిలిపివేయాలని కోరుతూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో హైకోర్టును ఆశ్రయించామని, దీనిపై ఈ నెల 29న విచారణ జరుగుతుందని వెల్లడించారు. (చదవండి: ఫస్ట్‌రోజే ఫిట్టింగ్ పెట్టిన బిగ్‌బాస్) -
‘ఆ విషయాలు నాగార్జున తెలుసుకోవాలి’
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 నిలిపేయాంటూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, జర్నలిస్టు శ్వేతారెడ్డి, గాయిత్రి గుప్తా జంతర్ మంతర్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. బిగ్‌బాస్ పేరుతో అశ్లీలతను పోత్రహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ విషయమై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశామని చెప్పారు. బిగ్‌బాస్‌లో కాస్టింగ్ కౌచ్ ఉన్న కారణంగానే శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా షో నుంచి బయటికొచ్చారని జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. అక్కడ జరుగుతున్న విషయాలను సినీ హీరో నాగార్జున తెలుసుకోవాలని కోరారు. (చదవండి : నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు) లైంగిక వేధింపులు, చీటింగ్... బిగ్‌బాస్ సెలక్షన్ ప్రాసెస్‌లో అన్యాయం జరుగుతోందని నటి గాయత్రిగుప్తా అన్నారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తున్నామని తెలిపారు. షో పేరుతో లైంగిక వేధింపులు, చీటింగ్ జరుగుతోందని ఆరోపించారు. పబ్లిసిటీ కోసమే చేస్తున్నామని తమను నిందిస్తున్నారని, అలాంటప్పుడు లీగల్‌గా ఎందుకు వెళ్తామని ప్రశ్నించారు. జర్నలిస్టు శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ను నిషేదించాలన్నదే తమ డిమాండ్ అన్నారు. బిగ్‌బాస్ ముసుగులో మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న లైంగికంగా వేధింపులపై దేశవ్యాప్తంగా అందరి సహకారం కోరుతున్నామని చెప్పారు. మా టీవీలో ‘బిగ్‌బాస్’ ప్రసారమవుతుందన్నది తెలిసిందే. (చదవండి : ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్’ వివాదం) -
ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్’ వివాదం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్-3’ వివాదం ఢిల్లీకి చేరింది. ఈ షో ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ.. జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తా జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. రియాలిటీ షో పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ.. వెంటనే ఈ షో ప్రసారం కాకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దానికి సంబందించిన వీడియోను కూడా విడుదల చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదును కమిషన్ స్వీకరించిందని శ్వేతారెడ్డి పేర్కొన్నారు. హెచ్చార్సీకి ఫిర్యాదు చేసిన ఓయూ జేఏసీ బిగ్‌బాస్ షో ప్రసారాన్ని నిలివేయాలని కోరుతూ ఓయూ జేఏసీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేసింది. రియాలిటీ షో పేరుతో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో షోను రద్దు చేయాలని కోరారు. ఒకవేళ షో నిర్వహించాల్సి వస్తే.. మహిళలపై వేధింపులు, అసభ్యకరమైన సన్నివేశాలు లేవని నిరూపించిన తర్వాతే షో వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో షో నిర్వాహకుల కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాగా ఇప్పటికే ఈ షోపై శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ రియాలిటీ షోను నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో ఇప్పటికే ఓ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. బిగ్ బాస్ షో ప్రదర్శన వల్ల యువత చెడిపోతుందంటూ సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తెలంగాణ హై కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
బిగ్‌బాస్ ప్రతినిధులపై శ్వేతరెడ్డి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ కార్యక్రమ ఇంచార్జ్తో పాటు మరో ముగ్గురు ప్రతినిధులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. యాంకర్, జర్నలిస్ట్ శ్వేతారెడ్డి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బిగ్‌బాస్ కార్యక్రమ ఇంచార్జ్ శ్యాంతో పాటు ప్రతినిధులు రవికాంత్, రఘు, శశికాంత్‌లపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావు తెలిపారు. చదవండి: బిగ్‌బాస్ హోస్ట్‌పై ‘స్టార్ మా’ ప్రకటన ఆయన తెలిపిన వివరాలు ప్రకారం..జర్నలిస్ట్ శ్వేతారెడ్డి బిగ్‌బాస్ సీజన్-3కి ఎంపికైనట్లు ఏప్రిల్‌లో సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒకసారి కలవాలంటూ చెప్పడంతో బంజారాహిల్స్‌లోని ఒక ఐస్‌క్రీం షాపులో కలిసి చర్చించారు. అనంతరం మరోమారు కార్యక్రమ ప్రతినిధులు రఘు, శశికాంత్ ఫోన్ చేసి కలవాలని చెప్పారు. దీంతో ఆమె మళ్లీ శ్రీనగర్ కాలనీలో కలిశారు. ఇక చివరగా కార్యక్రమ ఇంచార్జ్ శ్యాంతో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే అసభ్యంగా వ్యాఖ్యలు చేశారని, బిగ్‌బాస్‌లో తీసుకుంటున్నట్లు చెప్పిన నిర్వాహకులు అగ్రిమెంట్‌పై సంతకాలు చేయించుకున్న తర్వాత ముఖం చాటేశారన్నారు. శ్వేతారెడ్డి ఫిర్యాదు చేయడంతో నలుగురుపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా శ్వేతరెడ్డి మాట్లాడుతూ... ‘బిగ్‌బాస్ అనేది మైండ్ గేమ్. అలాంటి షోలో బాడీ షేపింగ్లో ఎందుకు చేసుకోవాలి. బాస్‌ను ఇంప్రెస్ చేయాలంటే ఆకర్షణీయంగా కనిపించాలి అన్నారు. అంతేకాకుండా నా బాడీ వెయిట్ గురించి అసభ్యకరంగా మాట్లాడారు. బిగ్‌బాస్-2 రియాల్టీ షోలో గలీజు...గబ్బు చీకటి కోణం గురించి పోలీసులకు వివరించాను. ఈ కార్యక్రమ నిర్వాహకులు 150మందితో గేమ్ ప్లాన్ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఎంపికైన ఎవరికీ అగ్రిమెంట్లు ఇవ్వలేదు. నేను ఈ విషయాన్ని బయటపెట్టిన తర్వాత చాలామంది బయటకు వస్తున్నారు. ఇంతకీ ఆ బాస్ ఎవరో.... ఆ దేవుడికే తెలియాలి. ఆ బాస్కే తెలియాలి.’ అని అన్నారు. ఈ నెల 26 నుంచి ప్రసారం కానున్న బిగ్‌బాస్-3కి ప్రముఖ హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. -
కేఏ పాల్‌పై శ్వేతారెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ హిందూపురం అభ్యర్థి, మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరు ప్రకటించారని, అనంతరం ఇటీవల జరిగిన ఓ సభలో తాను అడ్రస్ లేకుండా పోయానంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని పాత్రికేయురాలు శ్వేతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల ఓ సమావేశంలో తనను ప్రజాశాంతి పార్టీ మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. ఈ నెల 21 వరకు 10 వేల సభ్యత్వాలు చేయించమన్నారని, 21వ తేదీ రాకముందే వైజాగ్ సభలో శ్వేతారెడ్డి అడ్రస్ లేకుండా పోయానని తనను అనడం వెనక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని శ్వేతారెడ్డి పేర్కొన్నారు. హిందూపురం టికెట్‌ను ఇంకెవరికైనా అమ్ముకునేందుకు ఈ ప్రకటన చేశారా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజాశాంతి పార్టీకి ఎజెండా లేదని, ఓ సిద్ధాంతం లేదని ఆరోపించారు. కేఏ పాల్ నోరు తెరిస్తే ట్రంప్, ఒబామా అంటున్నారని, మిలియన్స్, ట్రిలియన్స్ డాలర్లు అంటూ.. అమరావతి అభివృద్ధికి రూ.10 కోట్లు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. సభ్యత్వం పేరుతో రూ.10, 100 ఎందుకు వసూలు చేస్తున్నారో వివరించాలని ఆమె డిమాండ్ చేశారు. క్రిస్టియన్ కమ్యూనిటీని అవమానపరిచేలా పాల్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేందుకు రాజకీయం చేస్తున్నట్లుగా తనకు అనుమానంగా ఉందన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జగన్ పాదయాత్ర చేశారని ఆమె స్పష్టంచేశారు. కేఏ పాల్‌కు శ్వేతారెడ్డి సంధించిన ప్రశ్నలు మీరిచ్చిన గడువు ముగియక ముందే నా గురించి ఎందుకు మాట్లాడారు? అసలు వైజాగ్‌లో నా టాపిక్ ఎందుకు మాట్లాల్సివచ్చింది? మీరేమైనా హిందూపురం సీటును అమ్ముకోవాలని చూస్తున్నారా? నేనేం తప్పు చేయకుండా బహిరంగ వేదికపై నా గురించి ఎందుకు మాట్లాడారు? మీ పార్టీ సమావేశాలు నిర్వహించడానికి మా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? జర్నలిస్టులు అంటే చులకన భావం ఎందుకు? దేవుడు బిడ్డ అబద్ధాలు ఆడకూడదని మీకు తెలియదా? గడువు ముగియకుండా నా సమర్థతను ఎలా నిర్ణయించారు? మాట మీద నిలబడాల్సిన బాధ్యత మీకు లేదా?