
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీలోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. కాంతార సినిమా మాస్టర పీస్ అని మెచ్చుకోని సెలబ్రిటీ లేడంతే అతిశయోక్తి కాదు. అంతటి ఆదరణ పొందిందీ చిన్న చిత్రం.
సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే రిషబ్ శెట్టిని ఇంటికి పిలిచి మరీ అతడిని ప్రశంసించారు. ఆ సమయంలో రిషబ్‌కు బంగారు చైన్‌తో పాటు బంగారు లాకెట్‌ను కూడా కానుకగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కాంతార మూవీ కన్నడలో సెప్టెంబర్ 30న, హిందీలో అక్టోబర్ 14న, తెలుగులో అక్టోబర్ 15న విడుదలవగా.. ఒక్క హిందీలోనే రూ.76 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ సినిమా రూ.350 కోట్లకు పైనే రాబట్టింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతుండటంతో కాంతార ఓటీటీ విడుదలను ఆలస్యం చేస్తున్నారు మేకర్స్.
చదవండి: ఇటీవలే ఆపరేషన్ సక్సెస్.. అంతలోనే నటి పరిస్థితి విషమం
బస్సులో ఒకడు అసభ్యంగా ప్రవర్తించాడు: ఆండ్రియా
Comments
Please login to add a commentAdd a comment