
‘కేజీయఫ్’ తర్వాత ఆ స్థాయిలో విజయం సాధించిన కన్నడ చిత్రం ‘కాంతార’. ఈ చిత్రం గురించి ఇప్పటీకీ దేశ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన ఈ చిత్రం.. అక్కడ భారీ విజయం సాధించింది. దీంతో ఈ సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. టాలీవుడ్‌లో అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం.. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.
ఈ చిత్రంపై టాలీవుడ్ టు బాలీవుడ్..అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే స్వయంగా రిషబ్ ని కలిసి అభినందించడం ఆసక్తిగా మారింది. అంతేకాదు ‘ తెలిసినది గోరంత తెలియనిది కొండంత.. ఈ విషయాన్ని సినిమాల్లో మీకంటే బాగా ఎవరూ చెప్పలేరు' అని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌ను కొనియాడారు.
రజనీకాంత్ తన సినిమా చూసి అభినందించడం పట్ల రిషబ్ స్పందించారు. తాజాగా ట్వీటర్ ఆయన ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ‘మీరు ఒక్కసారి మెచ్చుకుంటే 100 సార్లు మెచ్చుకున్నట్లే. ధన్యవాదాలు రజినీ సార్. మా ‘కాంతార’ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది’అని ట్వీట్ చేస్తూ రజనీకాంత్‌కి పాదాభివందనం చేస్తూ ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment