Kantara Star Rishab Shetty Gave Clarity On Entering Into Politics - Sakshi
Sakshi News home page

Rishab Shetty : 'కాంతార'తో పాన్‌ ఇండియాలో పాపులారిటీ.. త్వరలోనే రిషబ్‌ శెట్టి పొలిటికల్‌ ఎంట్రీ?

Apr 2 2023 3:47 PM | Updated on Apr 2 2023 4:32 PM

Kantara Star Rishab Shetty Gave Clarity On Entering Into Politics - Sakshi

కన్నడ సెన్సేషన్‌ కాంతార సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నాడు హీరో, డైరెక్టర్‌ రిషబ్‌ శెట్టి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు, ప్రశంసలతో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు రిషబ్‌ శెట్టి.

అయితే తాజాగా ఈ హీరోకు సంబంధించి ఓ వార్త కన్నడ నాట చర్చనీయాంశంగా మారింది. రిషబ్‌ శెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడంటూ తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ జర్నలిస్ట్‌ ట్వీట్‌ చేయడంతో కాసేపటికే అది వైరల్‌గా మారింది.

అయితే తాజాగా ఈ విషయంపై రిషబ్‌ శెట్టి స్పందించారు. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. ఈ ప్రచారంలో నిజం లేదు. నా సినిమాలకు మద్దతివ్వండి చాలు అంటూ అభిమానులు, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. గతంలోనూ తన పొలిటికల్‌ ఎంట్రీపై వార్తలు వచ్చాయని, అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపై ఉందని చెప్పుకొచ్చారు.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement