ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. | Prabhas 'Salaar' Movie Postponed, New Release Date To Be Out Soon | Sakshi
Sakshi News home page

Salaar Movie: ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. సలార్‌ను వాయిదా వేసిన మేకర్స్‌

Published Wed, Sep 13 2023 10:28 AM | Last Updated on Wed, Sep 13 2023 11:17 AM

Prabhas Salaar Movie Postponed, New Release Date Out be Soon - Sakshi

ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 28న విడుదల చేయాలనుకున్నాం.. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయక తప్పడం లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మీకు అద్భు

సలార్‌ వాయిదా పడనుందంటూ మొన్నటి నుంచి తెగ ప్రచారం జరుగుతోంది. చివరికి అదే నిజమైంది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాను వాయిదా వేసినట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. 'సలార్‌పై మీరు చూపుతున్న ప్రేమాభిమానాలకు మాకెంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 28న విడుదల చేయాలనుకున్నాం.. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయక తప్పడం లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మీకు అద్భుతమైన సినిమాను అందివ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. సినిమాను మరింత బాగా తీర్చిదిద్దేందుకు మా టీమ్‌ అవిశ్రాంతంగా పని చేస్తోంది. సలార్‌కు ఫైనల్‌ టచ్‌ ఇస్తున్నాం. కొత్త రిలీజ్‌ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం' అని హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌ ట్వీట్‌ చేసింది.

సలార్‌ సినిమా విషయానికి వస్తే..
ప్రభాస్‌ హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం సలార్‌. కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అందులో భాగంగా సలార్‌: పార్ట్‌ 1- సీజ్‌ ఫైర్‌ను ఈ నెలలో విడుదల చేస్తామన్నారు. కానీ అంతలోనే చిత్రాన్ని వాయిదా వేశారు. గ్రాఫిక్స్‌ పనులు పూర్తి కాకపోవడం వల్లే ఈ చిత్రాన్ని పోస్ట్‌పోన్‌ చేసినట్లు తెలుస్తోంది.

చదవండి:  ప్రియురాలిని పెళ్లాడిన యంగ్‌ హీరో.. ఫోటోలు వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement