Salaar Teaser Out: Prabhas-Prashanth Neel's gangster drama is a treat - Sakshi
Sakshi News home page

Prabhas Salaar Teaser: సలార్‌ టీజర్‌తో వేటకొచ్చిన డైనోసార్

Published Thu, Jul 6 2023 5:15 AM | Last Updated on Thu, Jul 6 2023 8:57 AM

Prabhas Salaar Movie Teaser Released - Sakshi

డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూసిన 'సలార్' టీజర్ వచ్చేసింది. ప్రభాస్ మాస్ యాక్షన్ అవతార్ అయితే చూస్తున్న ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేసి పడేసింది. దాదాపు 106 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో.. సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేసింది. ఇక ఇందులో ఎక్కువగా ప్రభాస్ కారెక్టర్‌కు సంబంధించి హీరో ఎలివేషన్‌ డైలాగ్‌ చెప్తూ సీనియర్‌ యాక్టర్‌ టిన్ను ఆనంద్‌ను చూపించారు. మిగతా క్యారెక్టర్స్‌ను పెద్దగా చూపించలేదు. ప్రభాస్‌ ఫేస్‌ మాత్రం చూపించకుండా పిడికిలి బిగించిన తన చేతిని మాత్రమే చూపించాడు డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్. ఫినిషింగ్‌లో మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను చూపిస్తూ టీజర్‌ను ముగించారు.

2023 సెప్టెంబర్‌ 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు టీజర్‌లో స్పష్టం చేశారు. సలార్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా శ్రుతిహాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. విలన్ రాజమన్నార్ పాత్రలో జగపతి బాబు, మరో విలన్గా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు. తమిళ నటి శ్రియారెడ్డి కూడా కీలకపాత్ర పోషించింది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్.. టీజర్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో గూస్ బంప్స్ తెప్పించాడు. ప్రశాంత్ నీల్ ఎప్పటిలానే మాస్ ఫార్ములాని నమ్ముకున్నాడు. టీజర్ చూస్తుంటే హోంబలే ఫిల్మ్స్ బడ్జెట్కి ఏ మాత్రం వెనకాడలేదని క్లియర్గా అర్థమవుతోంది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement