Is Prabhas Salaar Movie Part of the KGF Universe? - Sakshi
Sakshi News home page

Salaar Movie: కేజీయఫ్‌-2 క్లైమాక్స్‌తో ‘సలార్‌’కు లింకు.. అందుకే 5.12 గంటలకు టీజర్‌?

Published Tue, Jul 4 2023 1:39 PM | Last Updated on Tue, Jul 4 2023 2:21 PM

Is Prabhas Salaar Movie Part of the KGF Universe - Sakshi

మరో రెండు రోజుల్లో (జూలై 6) ‘సలార్‌’ టీజర్‌ రాబోతుంది. ‘ఆదిపురుష్‌ రిజల్ట్‌తో డీలా పడ్డ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి ఇది పెద్ద ఉమశమనం. అందుకే టీజర్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. జులై 6 తర్వాత తమ హీరో పేరు మరోసారి పాన్‌ ఇండియా స్థాయిలో మారు మ్రోగి పోవడం ఖాయమనే ధీమాతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇదిలా ఉంటే సలార్‌ టీజర్‌ని అంత పొద్దున( ఉదయం 5.12 గంటలకు) రీలీజ్‌ చేయడం వెనుక కారణం ఏంటనే చర్చ నెట్టింట మొదలైంది.

(చదవండి: బాలీవుడ్‌ కింగ్‌ షారుఖ్‌ను ఢీ కొడుతున్న ప్రభాస్..)

ప్రభాస్‌కి ఉదయమే టీజర్‌ని విడుదల చేసే సెంటిమెంట్‌ ఉందని, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ చిత్రాల మాదిరి సలార్‌ అప్‌డేట్‌ కూడా ఉదయమే ఇవ్వాలని ప్రభాస్‌ సూచించడంతోనే సలార్‌ టీజర్‌ని అంత పొద్దున రిలీజ్‌ చేస్తున్నారనే టాక్‌ నిన్నటిదాకా వినిపించింది. ఇక తాజాగా మరో క్రేజీ రూమర్‌ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. సలార్‌ మూవీకి కేజీయఫ్‌ చిత్రంతో లింక్‌ ఉందంట.. అందుకే టీజర్‌ని ఉదయం 5.12 గంటలకు విడుదల చేస్తున్నారనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతుంది.

సరిగ్గా 5.12 గంటలకే ఎందుకు?
ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన కేజీయఫ్‌ సిరీస్‌లు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికి తెలిసిందే. గతేడాది విడుదలైన ‘కేజీయఫ్‌ 2’ చిత్రం పార్ట్‌ 1ని మించిన విజయాన్ని సొంతం చేసుకుంది. రాఖీ భాయ్‌ చనిపోవడంతో ఆ చిత్రం ముగుస్తుంది. ఆ క్లైమాక్స్‌ సీన్‌కి సలార్‌ టీజర్‌ విడుదలకి సంబంధం ఉందట. రాఖీ భాయ్​ చనిపోయినట్లు చూపించే సన్నివేశంలో నాలుగు గడియారాలు ఉంటాయి. ఒక్కోక్కటి ఒక్కో సమయాన్ని సూచిస్తుంది.

అందులో ఒకటి సరిగ్గా 5.12 నిమిషాలను చూపిస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి ఇప్పుడు తెగ ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. కేజీయఫ్‌ సిరీస్‌తో సలార్‌కు లింక్‌ ఉందని.. అందుకే టీజర్‌ని ఉదయం 5.12 గంటలకు విడుదల చేస్తున్నారనే ప్రచారం నెట్టింట జోరుగా సాగుతుంది. కొంతమంది ఇది నిజమే అంటుంటే.. మరికొంత మంది ‘ఇదేం కనెక్షన్స్‌రా బాబోయ్‌...’ అని కామెంట్‌ చేస్తున్నారు. ఒక వేళ ఇదే నిజమైతే మాత్రం ఈ సారి బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement