KGF Chapter 2 Promotions: Yash Arrives In Chennai, Full Details Inside - Sakshi
Sakshi News home page

KGF Chapter 2 Promotions: చెన్నైలో సందడి చేసిన కేజీఎఫ్‌–2 టీం 

Published Sat, Apr 9 2022 9:40 AM | Last Updated on Sat, Apr 9 2022 10:42 AM

KGF Chapter 2 Promotions: Yash Arrives In Chennai - Sakshi

తమిళ సినీ పరిశ్రమలోని వారంతా శ్రమజీవులని కన్నడ రాకింగ్‌ స్టార్‌ యష్‌ అన్నారు. కేజీఎఫ్‌ చిత్రంతో పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ఈయన తాజాగా కేజీఎఫ్‌కు సీక్వెల్‌లో నటించారు. శ్రీనిధి శెట్టి, బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్, నటి రవీనా టాండన్, ప్రకాష్‌రాజ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ నెల 14న పాన్‌ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. దీనిని తమిళనాట డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ సంస్థ అధినేత ఎస్‌.ఆర్‌.ప్రభు విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ గురువారం చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించింది. యష్‌ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం తన మిత్రుడు విశాల్‌ ద్వారా కేజీఎఫ్‌ మొదటి భాగాన్ని విడుదల చేశామన్నారు. ఆ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన వారందరూ చాలా శ్రమజీవులని పేర్కొన్నారు. కేజీఎఫ్‌–2ను చాలా మంది అనువాద చిత్రంగా భావిస్తున్నారని, అయితే దీనిని ప్రతి వెర్షన్‌లోనూ భాషను గౌరవించి రూపొందించినట్లు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement