
Upcoming Movies Web Series Theatres And OTT April 3rd Week: 'ఆర్‌ఆర్‌ఆర్', 'రాధేశ్యామ్', గని తర్వాత మరో రెండు భారీ సినిమాలు ప్రేక్షకులను, మూవీ లవర్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఒకటి కన్నడకు, మరొకటి కోలీవుడ్‌కు చెందిన సినిమాలైన తెలుగులోనూ వాటికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఆ సినిమాల్లోని హీరోలే. అవును. వారే 'కేజీఎఫ్'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో యశ్ ఒకరైతే, తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ మరొకరు. వీరిద్దరు నటించిన చిత్రాలు ఈ వారంలో థియేటర్లలో హల్‌చల్ చేయనున్నాయి. మరీ ఆ చిత్రాలేంటీ.. విడుదల ఎప్పుడు అనే విషయాలతోపాటు ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటో చూద్దాం.
1. బీస్ట్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా విభిన్న కథలతో అలరిస్తున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'బీస్ట్'. ఈ సినిమా నుంచి విడుదలైన 'అరబిక్ కుత్తు' సాంగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఆడియెన్స్‌లో అంచనాలను పెంచేసింది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఏప్రిల్ 13న ఈ మూవీ విడుదల కానుంది.
2. కేజీఎఫ్: చాప్టర్ 2
'కేజీఎఫ్ 1'లో గరుడను రాకీ భాయ్ చంపే విధానం ప్రేక్షకులను ఎంతో ఆశ్చర్యపరిచింది. అయితే గరుడ మరణాంతరం ఏం జరిగింది ? గరుడ తర్వాత కేజీఎఫ్‌ను దక్కించుకునేందుకు అధీర ఏం చేశాడు ? అనే ప్రశ్నలతో 'కేజీఎఫ్: చాప్టర్ 2' ప్రేక్షుకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచింది. ఈ ఉత్కఠకు తెరదింపుతూ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ 'కేజీఎఫ్ 1' దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా ఇదే రోజున బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించిన 'జెర్సీ' విడుదల కావాల్సింది. కానీ 'కేజీఎఫ్ 2', 'బీస్ట్' చిత్రాలను దృష్టిలో పెట్టుకుని తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఓటీటీలో అలరించే సినిమాలు, వెబ్ సిరీస్‌లు
1. ఆడవాళ్లు మీకు జోహార్లు: ఏప్రిల్ 14 (సోనిలివ్)
2. గాలివాన (వెబ్ సిరీస్): ఏప్రిల్ 14 (జీ5)
3. దహనం: ఏప్రిల్ 14 (ఎంఎక్స్ ప్లేయర్)
4. బ్లడ్ మేరీ: ఏప్రిల్ 15 (ఆహా)
చదవండి: సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే..
Comments
Please login to add a commentAdd a comment