Yash Daughter Ayra Yash Singing Salaam Rocky Bhai Song,Video Viral - Sakshi
Sakshi News home page

Yash Daughter Ayra: ‘సలాం రాఖీ భాయ్‌’ అంటూ ఐరా ఎంత క్యూట్‌గా పాడిందో చూడండి..

Published Sat, Apr 30 2022 7:02 PM | Last Updated on Sat, Apr 30 2022 8:25 PM

Yash Daughter Ayra Says Salaam Rocky Bhai Video Goes Viral - Sakshi

Yash Daughter Ayra Says Salam Rocky Bhai: కన్నడ రాక్‌స్టార్‌ యశ్‌ ప్రస్తుతం కేజీయఫ్‌ 2 సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నాడు. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీయఫ్‌ 2 బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 1000కోట్లు కలెక్షన్స్‌ రాబట్టింది. ఒక్క బాలీవుడ్‌లోనే ఈ మూవీ రూ. 350 కోట్లు వసూళ్లు చేసిన తొలి దక్షిణాది సినిమా ఆల్‌ టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. ఇక మూవీ యశ్‌ కెరీర్‌లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

చదవండి: సమంతకు ప్రేమపై నమ్మకం పోయిందా? ఆమె ట్వీట్‌ అర్థం ఏంటి?

ఇక కేజీయఫ్‌ 2 షూటింగ్‌తో ఇంతకాలం ఫుల్‌ బిజీగా ఉన్న యశ్‌ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విరామ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. యశ్‌ ఫ్యామిలీ మ్యాన్‌ అనే విషయం తెలిసిందే. ఖాళీ దొరికితే కుటుంబంతో కలిసి టూర్లకు, వెకేషన్స్‌కు వెళతాడు. ఈ క్రమంలో కూతురు ఐరాతో యశ్‌ తన డేను స్టార్ట్‌ చేశాడు. ఉదయం లేవగానే ఐరాతో ఆడుకుంటున్న వీడియోను షేర్‌ చేశాడు యశ్‌. ఈ సందర్భంగా సలాం రాఖీ భాయ్‌ అంటూ ఐరా పాట పాడింది.

చదవండి: హిందీ భాష వివాదంపై కంగనా షాకింగ్‌ కామెంట్స్‌

‘సలాం రాకీ భాయ్‌.. రారా రాఖీ..’ అంటూ ఐరా క్యూట్‌గా పాడిన ఈ వీడియోను యశ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోకు యశ్‌ ఫ్యాన్స్‌, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సో క్యూట్‌ అంటూ ఐరాపై ముద్దులొలికిస్తున్నారు నెటిజన్లు. కాగా యశ్‌ 2016లో తన మొదటి సినిమా హీరోయిన్ రాధిక పండిట్‌‌ను పెళ్లిచేసుకోగా, వీరికి ఇద్ద‌రు సంతానం. కూతురు ఐరా 2018 డిసెంబర్‌లో జన్మించగా.. 2019 అక్టోబర్‌లో ఈ జంటకు యథ‌ర్వ్ జన్మించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement