KGF Director Prashanth Neel Reveals His Drinking Habit - Sakshi
Sakshi News home page

Prashanth Neel: మందు తాగుతా, ఆ టైమ్‌లోనే కథలు రాస్తాను: ప్రశాంత్‌ నీల్‌

Published Tue, Apr 12 2022 6:58 PM | Last Updated on Tue, Apr 12 2022 7:32 PM

KGF Director Prashanth Neel Reveals He Have Drinking Problem - Sakshi

చాలావరకు సెలబ్రిటీలు వారి వ్యక్తిగత విషయాలను మీడియా ముందు ప్రస్తావించడానికి వెనకడుగు వేస్తుంటారు. అతికొద్ది మంది మాత్రమే తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెరిచిన పుస్తకంలా బయటపెడుతుంటారు. తాజాగా కేజీఎఫ్‌ 2 డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ తనకు మద్యం తాగే అలవాటుందన్న విషయాన్ని బయటపెట్టాడు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 'ఓ షరతుతో ఈ విషయాన్ని బయటకు చెప్తున్నాను. నా ఇంటర్వ్యూలో ఈ భాగాన్ని కట్‌ చేసి పక్కన పడేయమని నాకు మాటివ్వండి.

నేను మద్యం సేవిస్తాను. మందు తాగుతూనే కథలు రాస్తుంటాను. నేను మత్తులో ఉన్నప్పుడు కూడా సినిమాలో ఈ సన్నివేశాం అవసరమా? లేదా? అనేది నిర్ధారిస్తుంటాను. ఇక్కడ కథ గురించి కాదు, దాన్ని ఎలా ప్రజెంట్‌ చేస్తున్నామనేది అత్యంత ముఖ్యమైన టాస్క్‌' అని చెప్పుకొచ్చాడీ డైరెక్టర్‌. కాగా ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్‌ మూవీ చేస్తుండగా, అనంతరం జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నాడు.

చదవండి: కత్రీనా కైఫ్‌ ప్రెగ్నెంట్‌ ? నెట్టింట వీడియో వైరల్‌

రణ్‌బీర్‌, ఆలియా.. త్వరగా పిల్లలను కనేయండి!: సంజయ్‌ దత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement