ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ చిత్రాలై పాన్ ఇండియా చిత్రాలను చూసేందుకు మూవీ లవర్స్ కోసం అమెజాన్ ప్రైం వీడియోస్ ఎర్లీ యాక్సెస్ ద్వారా ‘మూవీ రెంటల్స్’ పేరుతో కొత్త యాక్సెస్‌ను లాంచ్ చేసింది. ఈ ఎర్లీ రెంటల్ యాక్సస్ ద్వారా డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ కంటే ముందే బ్లాక్‌బస్టర్ చిత్రాలను ఇంట్లోనే చూడోచ్చు. ఈ యాక్సెస్‌ను మే 16 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు అమెజాన్ ప్రైం వీడియోస్ వారు.
దేశవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్స్‌కు ఈ సమ్మర్‌లో ఇంట్లోనే మరింత వినోదం అందించేందుకే అమెజాన్ ఈ కొత్త పోర్టల్‌ను లాంచ్ చేసింది. ఈ ఎర్లీ యాక్సెస్ ద్వారా పాన్ ఇండియా చిత్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన సినిమాలు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చిత్రాలు, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రిచ్ క్యాట్‌లాగ్ సినిమాలను హాయిగా ఇంట్లోనే చూసేయొచ్చు. ఇప్పటికే సబ్‌స్రైబ్ చేసుకున్న వారితో పాటు కొత్తగా సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి అమెజాన్ ప్రైం యాప్‌లోనే ఈ ‘మూవీ రెంటల్స్ ’ యాక్సెస్‌ను అందుబాటులోకి తెచ్చారు.
ఈ మూవీ రెంటల్స్‌లో ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన పాన్ ఇండియా చిత్రం కేజీయఫ్ 2 సినిమాను ముందుగానే స్ట్రీమింగ్ చేస్తోంది అమెజాన్. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కేజీయఫ్ 2ను అందుబాటులోకి తెచ్చింది.
అయితే ఈ ఎర్లీ యాక్సెస్ ‘మూవీ రెంటల్స్’లో సినిమాలు చూడాలంటే అదనంగా రూ. 199 చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా సబ్‌స్క్రైబ్ చేసుకునే వారితో పాటు ఇప్పటికే సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారు కూడా రూ. 199 చెల్లించాల్సిందే. ప్రైమ్‌వీడియోస్.కామ్ స్టోర్ ట్యాబ్ ద్వారా మీ ఆన్‌డ్రాయిడ్ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, ఎస్‌టీబీఎస్, ఫైర్ టీవీ స్టిక్ ద్వారా యాక్సెస్‌ను పొందండి.
అయితే ఒకసారి ఈ విండోలో సినిమా చూస్తే తిరిగి 48 గంటల తర్వాతే ఈ మూవీ మళ్లీ ప్లేబ్యాక్ అవుతుంది. అంటే ఈ సినిమాను 48 గంట్లో ఒకసారి మాత్రమే చూడోచ్చు. అలా ఈ రెంటల్ యాక్సెస్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న తేదీ నుంచి 30 రోజుల పాటు దీని వాలిడిటి ఉంటుంది. ఈ గడువులోపే కస్టమర్స్ ప్రపంచవ్యాప్తంగా రిలీజైన బ్లాక్‌బస్టర్ చిత్రాలను వీక్షించే అవకాశం ఉంది. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ ఎర్లీ రెంటల్ యాక్సెస్ పొంది ఇంట్లోనే బ్లాక్‌బస్టర్ సినిమాలు చూస్తూ ఈ సమ్మర్‌ను కూల్‌గా ఎంజాయ్ చేయండి.
(అడ్వర్టోరియల్)
Comments
Please login to add a commentAdd a comment