KGF 2 Free Streaming For Subscribers On Amazon Prime From June 3rd, Deets Here - Sakshi
Sakshi News home page

KGF 2 OTT Streaming: అమెజాన్‌లో కేజీయఫ్‌ 2 స్ట్రీమింగ్‌, ఇకపై ఉచితం

Published Tue, May 31 2022 8:23 PM | Last Updated on Wed, Jun 1 2022 9:12 AM

KGF 2 Free Streaming For Subscribers On Amazon Prime From June 3rd - Sakshi

క‌న్న‌డ సినిమాకు అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టిన తొలి చిత్రంగా కేజీయఫ్‌ నిలిచింది. ​ఎలాంటి అంచనాలు లేకుండ 2018లో విడుద‌లైన ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. దీనికి సీక్వెల్‌గా కేజీయఫ్‌ 2 తెరకెక్కి ఎప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం క‌లెక్షన్ల ప్ర‌భంజ‌నం సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టి రూ.400 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టింది. నార్త్‌లో ‘బాహుబ‌లి’ త‌ర్వాత రూ.400 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టిన సినిమాగా కేజీయఫ్‌ 2 రికార్డు సృష్టించింది. 

చదవండి: సింగర్‌ సిద్ధూ హత్య.. సల్మాన్‌కు లారెన్స్‌ వార్నింగ్‌.. అప్రమత్తమైన పోలీసులు

ఇటీవ‌లే ఈ చిత్రం రూ. 1200కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘కేజీయఫ్‌ 2’ ఓటీటీలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ డిజిటల్‌ హ‌క్కుల‌ను అమెజాన్‌ ప్రైం వీడియోస్‌ సొంతం చేసుకుంది. మార్చి 16 నుంచి ‘పే ప‌ర్ వ్యూ’ ప‌ద్ధ‌తిలో స‌బ్‌స్క్రైబ‌ర్లు అద‌నంగా రూ.199 పెట్టి సినిమా చూసే విధానంతో అందుబాటులోకి తెచ్చారు కేజీయఫ్‌ 2ను. అయితే త్వ‌ర‌లోనే కేజీయఫ్‌ చిత్రానికి ‘పే ప‌ర్ వ్యూ’ ప‌ద్ద‌తిని తొలిగించ‌నున్నారు.

చదవండి: నిర్మాత, హీరో మధ్య మనస్పర్థలు?, అందుకే పదేపదే వాయిదా!

జూన్ 3 నుంచి స‌బ్‌స్క్రైబ‌ర్‌లు ఈ చిత్రాన్ని ఉచితంగా చూసే వెసులు బాటును అమెజాన్‌ సంస్థ క‌ల్పించ‌నుంది. తాజాగా దీనిపై అమెజాన్‌ అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది.  శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్, నటి రవీణ టాండన్‌ రావూర‌మేష్, ప్ర‌కాశ్‌రాజ్‌లు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ర‌వి బ‌స్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిరగందూర్ నిర్మించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement