Siddharth Shocking Comments On KGF 2, Pan India: కేజీయఫ్ 2 మూవీని పాన్ ఇండియా అని పిలుస్తుంటే ఫన్నీగా అనిపిస్తుందంటూ హీరో సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సిద్ధార్థ్ తాజాగా నటించిన వెబ్ సిరీస్ ‘ఎస్కేప్ లైవ్’ త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తన వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా ఓ జాతీయ మీడియాతో ముచ్చటించిన సిద్ధార్థ్ ఈ సందర్భంగా కేజీయఫ్2 సక్సెస్, ‘పాన్ ఇండియా’ కాన్సెప్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: ఆ సీన్స్‌తో మళ్లీ రిలీజవుతున్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీ!
ఈ మేరకు సిద్ధార్థ్ మాట్టాడుతూ.. ‘పాన్ ఇండియా.. ఈ పదం వినడానికి చాలా ఫన్నీగా ఉంది. 15 ఏళ్ల నుంచి వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్నాను. ఏ భాషల్లో చేస్తే ఆ భాషకు డబ్బింగ్ నేనే చెప్పుకునే వాడిని. తమిళ సినిమాల్లో చేస్తే తమిళియన్‌గా, టాలీవుడ్‌లో చేస్తే అచ్చమైన తెలుగు అబ్బాయిలా.. అలాగే ఇప్పుడు హిందీలో భగత్ సింగ్‌కు కూడా. అయితే, నా వరకు వాటిని ఇండియన్ సినిమాలు అని పిలవడమే నాకు ఇష్టం. ఎందుకంటే పాన్ ఇండియా అంటుంటే నాకు అగౌరవంగా అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే తాను ఈ వ్యాఖ్యలు ఎవరిని ఇబ్బంది పెట్టడాలని అనడం లేదన్నాడు. ‘పరిశ్రమలో అధిక ప్రాధాన్యత ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి విడుదలైన ఓ హిందీ సినిమా అత్యధిక ప్రేక్షాకదరణ పొందితే దానిని హిందీ సినిమా అనే అంటారు. కానీ, ప్రాంతీయ సినిమాలకు విషయానికి వస్తే అలా ఎందుకు ఉండదు. ప్రాంతీయ చిత్రాలకు విశేషమైన ఆదరణ లభించి, భారీ విజయం సాధిస్తే వాటిని ఎందుకు పాన్ ఇండియా అని పిలవడం? భారతీయ చిత్రం అనొచ్చు కదా. లేదా కేజీయఫ్ జర్నిని గౌరవించి కన్నడ సినిమా అని చెప్పొచ్చు.
చదవండి: తెలుగు ఫిలిం చాంబర్‌పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు
లేదా ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్‌ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ సినిమా అని పిలవచ్చు. కాబట్టి పాన్ ఇండియా సినిమా అని కాకుండా ఇండియన్ ఫిలిం అని చెప్పండి. పాన్ అంటే ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆ పదం చాలా ఫన్నీగా ఉంది’ అంటూ సిద్ధార్థ్ అభిప్రాయపడ్డాడు. అయితే గతంలో కూడా సిద్ధార్థ్ పాన్ ఇండియా పదంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ చేసేవి అన్ని భారతీయ చిత్రాలే అయినప్పుడు పాన్ ఇండియా అని ఎందుకంటున్నారని, అలా అయితే 15 ఏళ్ల క్రితమే రోజా అనే పాన్ ఇండియా సినిమా రాలేదా? మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూశారని వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment