పెళ్లి తర్వాత నటించనన్నావ్‌.. మరి ఇదేంటి?! | Anushka Sharma Old Clip On Not Working After Marriage Goes Viral | Sakshi
Sakshi News home page

పెళ్లి తర్వాత నటించనన్నావ్‌.. మరి ఇదేంటి?!

Published Thu, Apr 1 2021 8:58 PM | Last Updated on Fri, Apr 2 2021 3:30 PM

Anushka Sharma Old Clip On Not Working After Marriage Goes Viral - Sakshi

మహిళల జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం బిడ్డకు జన్మనివ్వడం. నవమోసాలు బిడ్డను తన కడుపులో మోసి జన్మనిస్తుంది స్త్రీ. ఇక డెలివరీ తర్వాత కనీం ఆరు నెలల వరకు ఏ పనులు చేయరు.. బిడ్డను చూసుకోవడంతోనే సరిపోతుంది ఆడవారికి. అందుకే ఉద్యోగం చేసే మహిళలకు కూడా ఆరు నెలల మెటర్నటీ లీవు ఇస్తాయి కంపెనీలు. కానీ సెలబ్రిటీలు మాత్రం రెండు మూడు నెలల విరామం తర్వాత వారి వారి పనులతో బిజీ అవుతారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. బిడ్డకు జన్మనిచ్చి పట్టుమని మూడు నెలలు కూడా కాలేదు.. అప్పుడే షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఓ యాడ్‌ షూట్‌ పాల్గొన్న అనుష్క ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్‌ చేశారు. ఇది చూసిన నెటిజనులు అనుష్క శర్మకు సంబంధించిన ఓ పాత వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి.. ఇదేంటి అనుష్క.. మాట తప్పావ్‌ అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ఆ వీడియోలో అనుష్క ఏం మాట్లాడింది అనే వివరాలు.. 2012 లో ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్ టాక్ షో హోస్ట్ సిమి గరేవాల్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా పెళ్లి గురించి, ఇండస్ట్రీ గురించి పలు విషయాలను వెల్లడించారు అనుష్క శర్మ.

ఆ వీడియోలో ‘‘వివాహం తర్వాత మీరు నటిస్తారా’’ అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు అనుష్క పెళ్లి తర్వాత తాను పనిచేయదలుచుకోవడం లేదని చెప్పారు. వివాహం తనకు చాలా ముఖ్యమని, పెళ్లి చేసుకొని పిల్లలను కనాలని అనుకుంటున్నాను అన్నారు. అంతేకాకుండా పెళ్లి తర్వాత సినిమాలు, యాడ్స్ వంటివి చేయనని వెల్లడించారు. అప్పుడు అలా మాట్లాడిన అనుష్క ఇప్పుడు పెళ్లై.. పాప పుట్టిన తర్వాత యాడ్స్‌లో నటించడానికి సిద్ధమయ్యారు. దీంతో గతంలో మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన నెటిజనులు.. ఇదేంటి అనుష్క ఇలా చేశావ్‌.. మాట తప్పావ్‌ అంటూ ప్రశ్నిస్తున్నారు. 

అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీని 2017 లో వివాహం చేసుకున్నారు. సిమి గరేవాల్‌తో ఇంటర్వ్యూ తర్వాత సంవత్సరం 2013 లో ఈ జంట ఓ వాణిజ్య ప్రకటనలో కలిసి నటించారు. చాలా సంవత్సరాలు డేటింగ్ చేసిన తరువాత డిసెంబర్ 2017 లో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 11న వామికా అనే కుమార్తెకు జన్మనిచ్చారు. అనుష్క శర్మ 2008 లో రాబ్ నే బనా దీ జోడి చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇక వివాహం తరువాత పరి, సంజు, సుయిధాగా, జీరో వంటి సినిమాల్లో కనిపించారు.

చదవండి: 
అనుష్క సెల్ఫీ: ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్‌
విరుష్కా: నెంబర్‌ 11 వెనుకున్న రహస్యం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement