Pooja Hegde About Working With Amitabh Bachchan: అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం పూజా కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దివాళి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ సరసన 'సర్కస్' సినిమా చేస్తోంది ఈ బ్యూటీ. ఇవేకాకుండా పలు సినిమాలతో జోరు మీద ఉంది. సినిమాలే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉంటోంది పూజా.
ఇటీవల బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ప్రముఖ శీతల పానీయం మాజా యాడ్‌లో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ యాడ్‌లో అమితాబ్‌తో నటించడం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ బుట్టబొమ్మ. 'అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. నాలాంటి వారికి అమితాబ్ గురువులాంటివారు. ఇంత వయసులో కూడా ఆయన సమయపాలన, డెడికేషన్ నాకెంతో నచ్చాయి. ఆయన మనవరాలిగా నటిస్తున్నప్పుడు చెప్పలేని అనుభూతికి లోనయ్యాను' అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.
చదవండి: స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్
పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ..
చదవండి: వెబ్ వీక్షకులు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న ఈమె ఎవరో తెలుసా ?
మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment