Cool drink company
-
ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం: పూజా హెగ్డే
Pooja Hegde About Working With Amitabh Bachchan: అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. తెలుగు, తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం పూజా కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దివాళి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్లో రణ్వీర్ సింగ్ సరసన 'సర్కస్' సినిమా చేస్తోంది ఈ బ్యూటీ. ఇవేకాకుండా పలు సినిమాలతో జోరు మీద ఉంది. సినిమాలే కాకుండా పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉంటోంది పూజా. ఇటీవల బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ప్రముఖ శీతల పానీయం మాజా యాడ్‌లో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ యాడ్‌లో అమితాబ్‌తో నటించడం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ బుట్టబొమ్మ. 'అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. నాలాంటి వారికి అమితాబ్ గురువులాంటివారు. ఇంత వయసులో కూడా ఆయన సమయపాలన, డెడికేషన్ నాకెంతో నచ్చాయి. ఆయన మనవరాలిగా నటిస్తున్నప్పుడు చెప్పలేని అనుభూతికి లోనయ్యాను' అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. చదవండి: స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. చదవండి: వెబ్ వీక్షకులు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న ఈమె ఎవరో తెలుసా ? మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ -
Thums Up: ఎట్టకేలకు ఆ ఘనత సాధించిన శీతల పానీయ సంస్థ
నిదానమే ప్రధానం అనే నానుడి శీతల పానీయ బ్రాండ్ థమ్స్ అప్‌కు సరిగ్గా సరిపోతుంది. ప్యాకేజ్డ్ డ్రింక్స్ మార్కెట్లో నెమ్మదిగా.. స్థిరంగా వ్యాపారవృద్ధిని సాధించుకుంటూ వస్తున్న థమ్స్ అప్ ఇప్పుడు అరుదైన ఫీట్ సాధించింది. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ‘బిలియన్ డాలర్ల బ్రాండ్’ ఘనత ఎట్టకేలకు దక్కింది. 1977లో కోలా కింగ్ రమేష్ చౌహాన్ థమ్స్ అప్ శీతల పానీయ బ్రాండ్‌ను ప్రారంబించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత బేవరేజెస్ మార్కెట్లో దీని హవా కొనసాగుతోంది. స్వదేశీ బ్రాండే అయినప్పటికీ ప్రస్తుతం ఇది కోకా కోలా కింద ఉంది. అయితే కిందటి ఏడాది అమ్మకాల్లో (2021)లో బిలియన్ డాలర్ మార్క్‌ను(7,500 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్) దాటేసింది థమ్స్ అప్. గ్లోబల్ బేవరేజెస్ మార్కెట్లో బిలియన్ డాలర్ల మార్కెట్ ఉన్న కంపెనీలు చాలా ఉన్నా.. థమ్స్ అప్ ఈ మార్క్‌ను స్వదేశీ ట్యాగ్‌తో అందుకోవడమే ఇక్కడ కొసమెరుపు. ‘‘మా స్థానిక థమ్స్ అప్ బ్రాండ్ మార్కెటింగ్ ప్రణాళిక, సరైన ఐడియాలతో భారతదేశంలో బిలియన్-డాలర్ల బ్రాండ్‌గా అవతరించింది. థమ్స్ అప్ ఇప్పుడు భారతదేశంలో బిలియన్ డాలర్ల బ్రాండ్” అని కోకా కోలా కంపెనీ CEO జేమ్స్ క్విన్సీ గర్వంగా ప్రకటించుకున్నారు. స్వదేశీ తయారీ కూల్ డ్రింక్ అయిన థమ్స్ అప్ను 1993లో కోకాకోలా సొంతం చేసుకుంది. పార్లే బిస్లరీ వ్యవస్థాపకుడు, ఇండియన్ కోలా కింగ్ రమేష్ చౌహాన్ నుంచి ఈ బ్రాండ్‌ను కొనుగోలు చేసింది కోకా కోలా. థమ్స్ అప్‌తో పాటు మాజా, ఆ టైంలో సూపర్ హిట్ అయిన కూల్ డ్రింక్ బ్రాండ్ గోల్డ్ స్పాట్‌ను సైతం కొనుగోలు చేసేసింది. -
పన్ను చెల్లింపుల్లో కూల్.. కూల్..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరిగే వేల కోట్ల రూపాయల విలువైన శీతల పానీయాల వ్యాపారానికి సంబంధించి పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరుగుతున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ గుర్తించింది. కూల్డ్రింకులు తయారు చేసే రెండు అంతర్జాతీయ కంపెనీలు హిందుస్థాన్ కోకోకోలా, పెప్సీకోలా కంపెనీలు ఏటా రూ. 2వేల కోట్లకు పైగా విలువైన వ్యాపారం చేస్తూ, విలువ ఆధారిత పన్ను చెల్లిస్తున్నప్పటికీ... తరువాత అంచెల్లో పన్ను ఎగవేస్తున్నట్లు అధికారులు తేల్చారు. కంపెనీల్లో తయారైన కూల్డ్రింకులు అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్ల ద్వారా వినియోగదారులకు చేరుతాయి. ఈ క్రమంలో కూల్‌డ్రింక్ కంపెనీలు తాము డిస్ట్రిబ్యూటర్లకు విక్రయించిన ధర మీద వ్యాట్ చెల్లిస్తున్నాయే తప్ప... డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లు మాత్రం తాము జరిపే విక్రయాలపై లభించే మార్జిన్ మీద పన్ను చెల్లించడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన వాణిజ్యపన్నుల శాఖ తదుపరి చర్యలకు రంగంలోకి దిగింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో కూల్‌డ్రింక్ కంపెనీల ద్వారా డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లకు చేరిన ‘సరుకు’ వివరాలను సేకరించి ‘మార్జిన్’పై పన్ను చెల్లించని వారి గురించి ఆరా తీస్తోంది. మూడు అంచెల్లోపన్ను చెల్లించాల్సిందే! ఒక వస్తువు తయారై వినియోగదారుడికి చేరే ప్రక్రియలో మూడంచెల్లో ఎప్పటికప్పుడు విలువ ఆధారిత పన్ను చెల్లించాల్సి ఉంటుందని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. కంపెనీలో వస్తువు తయారై డిస్ట్రిబ్యూటర్‌కు విక్రయించిన ధరపై 14.5 శాతం పన్ను చెల్లించాలి. తరువాత డిస్ట్రిబ్యూటర్ నుంచి రిటైలర్‌కు, రిటైలర్ నుంచి వినియోగదారుడికి చేరే సమయాల్లో కూడా వారికి లభించే ‘మార్జిన్’ మీద 14.5 శాతం మేర పన్ను చెల్లించాల్సిందే. కానీ కూల్‌డ్రింక్ వ్యాపారంలో అది జరగడం లేదని వాణిజ్యపన్నుల శాఖ గుర్తించింది. కోకోకోలా, పెప్సీ కోలా కంపెనీలు రూ. 2వేల కోట్ల టర్నోవర్‌పై రూ. 220 కోట్లు పన్ను చెల్లిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్, రిటైలర్లలో మెజారిటీ తమకు లభించే మార్జిన్ మీద పన్ను చెల్లించడం లేదని అధికారులు గుర్తించారు. కమిషనర్ అనిల్‌కుమార్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో పాటు డివిజన్లలోని అధికారులు 50 బృందాలుగా ఏర్పాటై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూల్‌డ్రింక్ డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్ల లావాదేవీల డేటాను సేకరించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 10 జిల్లాల్లోని కూల్‌డ్రింక్ డిస్ట్రిబ్యూటర్లను టార్గెట్ చేసుకొని రెండు, మూడు అంచెల్లో జరిగిన కూల్‌డ్రింక్ అమ్మకాల వివరాలు సేకరిస్తున్నారు. వీటిని పరిశీలించి డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్ల నుంచి మార్జిన్ మీద పన్ను వసూలు చేయనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. కాగా రూ. 100 కోట్ల వరకు పన్ను వసూలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.