‘ఎంత అందంగా ఉన్నావో.. నీ పెళ్లెప్పుడు?’ | Alia Bhatt turns A Beautiful Bride For Ad Shoot | Sakshi
Sakshi News home page

‘ఎంత అందంగా ఉన్నావో.. నీ పెళ్లెప్పుడు?’

Feb 11 2021 8:02 PM | Updated on Feb 11 2021 8:24 PM

Alia Bhatt turns A Beautiful Bride For Ad Shoot - Sakshi

పీచ్‌ కలర్‌ లెహంగా.. దానికి మ్యాచింగ్‌ భారీ ఆభరణాలు ధరించి..  చేతుల్లో ఎర్రగా పండిన మెహందీని చూపుతూ

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో పెళ్లి టాపిక్‌ వస్తే చాలు.. అందరి కళ్లు రణ్‌బీర్ కపూర్‌‌-ఆలియా భట్‌ల మీదకే వెళ్తాయి. గత కొన్నేళ్లుగా లవ్‌లో ఉన్న వీరిద్దరి పెళ్లి గురించి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మీడియా కూడా వీరిని అడిగే ఫస్ట్‌ ప్రశ్న పెళ్లి గురించే. తాజాగా మరో సారి రణ్‌బీర్‌-ఆలియా పెళ్లి ముచ్చట తెర మీదకు వచ్చింది. ఇందుకు కారణం ఏంటంటే కొద్ది రోజుల కిత్రం ఆలియా మెహందీ ఆర్టిస్ట్‌ వీణా నగ్డా కోసం బ్రైడల్‌ యాడ్‌ షూట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోని వీణా ఇన్‌స్టాగ్రామ్‌‌లో షేర్‌ చేశారు. 

పీచ్‌ కలర్‌ లెహంగా.. దానికి మ్యాచింగ్‌ భారీ ఆభరణాలు ధరించి..  చేతుల్లో ఎర్రగా పండిన మెహందీని చూపుతూ ఆలియా దిగిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘‘పెళ్లి కుమార్తెగా ఎంత అందంగా.. ముద్దుగా ఉన్నావో’’.. ‘‘త్వరగా పెళ్లి చేసుకో’’.. ‘‘ఇంతకు నువ్వెప్పుడు పప్పన్నం పెడతావ్‌’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. ఈ ఫోటోలో ఆలియాతో పాటు మెహందీ డిజైనర్‌ వీణా నగ్డా కుడా ఉన్నారు. తాజాగా వీణ.. వరుణ్‌ ధావన్‌-నటాషా దలాల్‌ వివాహం సందర్భంగా వారికి మెహందీ డిజైనర్‌గా వ్యవహరించారు. 

ఇక ఆలియా-రణ్‌బీర్‌ల విషయానికి వస్తే.. ఈ జంట 2020లోనే వివాహం చేసుకోవాల్సి ఉండేనని.. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తితో అన్ని ప్లాన్స్‌ అటకెక్కాయని స్వయంగా రణ్‌బీర్‌ కపూరే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆలియా తెలుగులో ప్రతీష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో రామ్‌ చరణ్‌కు  జోడిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

చదవండి: నన్ను దారుణంగా తిడుతున్నారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement