సూపర్‌స్టార్ మహేష్ బాబు నలభై ఐదేళ్ల వయసులోనూ ఇరవై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు. వయసు పెరిగే కొద్దీ మహేష్ మాత్రం ఇంకా యంగ్‌గా కనిపిస్తూ రోజురోజుకీ తన అందాన్ని పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా మహేష్‌బాబు పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ యాడ్ చిత్రీకరణ కోసం తీసిన ఈ ఫోటో తనకిష్టమైన లుక్స్‌లో ఒకటని మహేష్ తెలిపాడు. ఎంతో స్మార్ట్ అండ్ హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్న ఈ పోటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ఈ ఫోటోను క్లిక్‌మనిపించాడు.
ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమాలో మహేష్ నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ సంస్థలు నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మహానటి ఫేం కీర్తి సురేష్ ఈ సినిమాతో తొలిసారి మహేష్‌తో జోడీ కట్టనున్నారు. ఈ చిత్రం అనంతరం భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములతో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. (రామ్ చరణ్ నో చెప్పిన కథకు మహేష్ ఓకే?)
Comments
Please login to add a commentAdd a comment