
త్వరలో కరెన్సీ నోట్లకు కొత్త రూపు!
ముంబై: మనం వినియోగిస్తున్న కరెన్సీ నోట్లు త్వరలో కొత్త రూపును సంతరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త నోట్లకు సంబంధించి ఆర్‌బీఐ కొన్ని కొత్త నమూనాలను ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు గురువారమిక్కడ గవర్నర్ రాజన్ నేతృత్వంలో జరిగిన సెంట్రల్ బోర్డు సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.
అయితే డిజైన్లకు సంబంధించి మరే ఇతర అంశాలనూ ప్రస్తావించలేదు. ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్‌లోటు వంటి అంశాలను ఆర్‌బీఐ సమీక్షించింది. సైబర్ సెక్యూరిటీ, కరెన్సీ నిర్వహణ విధానాలను కూడా చర్చించింది. ప్రభుత్వ బ్యాంకింగ్ బిజినెస్ కార్యకలాపాలు, బ్యాంకింగ్ సేవల విషయమై కస్టమర్ల ఫిర్యాదులు వంటి అంశాలనూ సమీక్షించినట్లు ప్రకటన వివరించింది.