
యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. లవ్ స్టోరీ ఉన్న సినిమాలతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా కనిపించిన రణ్‌బీర్ తాజాగా గుబురు గడ్డంతో దర్శనమిచ్చాడు.
Ranbir Kapoor Rugged Look From Shamshera Movie Goes Viral: యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్ లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. లవ్ స్టోరీ ఉన్న సినిమాలతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా కనిపించిన రణ్‌బీర్ తాజాగా గుబురు గడ్డంతో దర్శనమిచ్చాడు. రణ్‌బీర్ కపూర్ తాజాగా నటించిన చిత్రం షంషేరా. ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో వాణి కపూర్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించనున్నారు. కరణ్ మల్హోత్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా రణ్‌బీర్ కపూర్ లుక్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్‌లో రణ్‌బీర్ కపూర్ గుబురు గడ్డం, సూటిగా చూస్తున్న కళ్లు, చేతిలో గొడ్డలితో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో పలువురు నెటిజన్ల్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీలో రణ్‌బీర్ 1800 కాలం నాటి స్వాతంత్ర్య కాంక్ష కలిగిన దోపిడి ముఠా నాయకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా 'సంజు' సినిమా తర్వాత రణ్‌బీర్ మూవీ ఏది ఇప్పటివరకు విడుదల కాలేదు. నాలుగేళ్ల తర్వాత హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ కానున్న 'షంషేరా'పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
చదవండి: థియేటర్‌లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్