Actress Samantha Latest Stunning Looks Viral | Samantha New Drools Ad - Sakshi
Sakshi News home page

Samantha New Look: సామ్‌ సర్జరీ చేసుకుందా? ఇలా మారిపోయిందేంటి!

Published Wed, Oct 26 2022 1:37 PM | Last Updated on Wed, Oct 26 2022 3:11 PM

Samantha Shocking Look In Her Latest Drools Gravy Ad Video  - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ధా కాలం దాటిన ఇప్పటికీ కెరీర్‌ పరంగా ఫుల్‌ స్వింగ్‌లో ఉంది. వరుస అవకాశాలు ఆమె తలుపు తడుతూనే ఉన్నాయి. ఆమెకు ముందు, ఆమె తర్వాత వచ్చిన హీరోయిన్లు అవకాశాలు లేక ఫేడ్‌అవుట్‌ అయ్యారు. కానీ సామ్‌ మాత్రం ఇప్పటికీ ఆఫర్స్‌ క్యూ కడుతూనే ఉన్నాయి. ఇక గతేడాది స్టార్‌ హీరో నాగచైతన్యతో విడిపోయిన ఆమె తరచూ ఏదోకరకంగా వార్తల్లో నిలుస్తోంది.

చదవండి: ఆల్భమ్‌ సాంగ్‌లో రెచ్చిపోయిన ఉర్ఫీ జావేద్‌.. తీవ్ర వ్యతిరేకత.. కేసు నమోదు

ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్‌తో ఫుల్‌ బిజీగా ఉంది సమంత. తెలుగు, తమిళ్‌, హిందీతో పాటు ఓ హాలీవుడ్‌ చిత్రానికి సంతకం చేసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేసే పనిలో ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో సామ్‌ సర్జరీ కోసమే విదేశాలకు వెళ్లిందంటూ ఆ మధ్య పుకార్లు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో సామ్‌ న్యూలుక్‌ చర్చనీయాంశమైంది. తాజాగా ఓ ప్రకటనలో సామ్‌ను చూసి ఫ్యాన్స్‌ అంతా షాక్‌ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇందులో సామ్‌ ముందుకంటే కాస్తా భిన్నంగా కనిపిస్తోంది.

చదవండి: పెళ్లిలో నటి పూర్ణ వేసుకున్న బంగారం ఎంతో తెలుసా?

సదరు ప్రకటనలో సామ్‌ డిఫరెంట్‌గా కనిపించడం చూసి ఆమె ఫాలోవర్స్‌, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఏంటీ సామ్‌ ఇలా మారిపోయింది! సర్జరీ చేసుకుందా?’ అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సమంత శాకుంతలం,  యశోద చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటుంది. హాస్టారికల్‌ పాన్‌ ఇండియా చిత్రం రూపొందుతున్న శాకుంతలం షూటింగ్‌ చివరి దశకు చేరుకోవడమే కాదు డబ్బింగ్‌ వర్క్‌ను కూడా జరుపుకుంటోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement