
సరికొత్త లుక్‌లో!
నారారోహిత్ సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథతో శ్రీ కీర్తి ఫిలిమ్స్ పతాకంపై కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో కె.అశోక్‌బాబు, వి.నాగార్జున్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లతా హెగ్డే కథానాయిక. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘‘ ఈ సినిమా పాటలను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అన్ని వాణిజ్య హంగులతో ఈ చిత్రాన్ని రూపొందించాం. అన్ని వర్గాల వారికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అని నిర్మాతలు తెలిపారు.