
పవర్ స్టార్‌గా తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు పవన్ కల్యాణ్. తన అభిమానులు రాజకీయాల్లోనూ మద్దతుగా నిలుస్తారని భావించాడు. కానీ రాజకీయాల్లో పవన్ దారుణంగా విఫలమయ్యాడు. పోటి చేసిన రెండు స్థానాల్లోనూ గెలవలేకపోయాడు పవన్. దీంతో తిరిగి సినిమాల్లో నటిస్తారన్న టాక్ టాలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగానే వినిపిస్తోంది.
తాజాగా పవన్ న్యూ లుక్ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఎన్నికల ముందు వరకు తెల్ల పంచె, తెల్ల లాల్చీలో కనిపించిన పవన్ తరువాత జీన్స్ టీషర్ట్స్‌లోకి మారిపోయాడు. తాజాగా గెడ్డం కూడా ట్రిమ్ చేసి స్టైలిష్ లుక్‌లోకి వచ్చేశాడు. జీన్స్, కలర్‌ఫుల్ షర్ట్‌లో సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీకి సిద్ధమైనట్టుగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం న్యూ లుక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పవన్ త్వరలోనే సినిమాల్లో నటించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
Comments
Please login to add a commentAdd a comment