
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత మనోజ్ ఇంతవరకు సినిమా చేయలేదు. ఆ మధ్య ‘అహం బ్రహ్మాస్మి’ అనే పాన్ ఇండియా సినిమాను ప్రకటించినా ఇంతవరకు అది పట్టాలెక్కలేదు. ఇదిలా ఉండగా తాజాగా మనోజ్ షేర్ చేసిన ఓ లెటెస్ట్ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
బ్లాక్ అండ్ వైట్ లుక్‌లో ఉన్న ఫోటోను షేర్‌చేసిన మనోజ్ త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇది సినిమాలోని స్టిల్ అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ మనోజ్ మాత్రం తన నెక్ట్స్ మూవీ గురించి ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ‘అహం బ్రహ్మాస్మి’ గురించి అప్‌డేట్ అడగ్గా.. మనోజ్ ఒక స్మైలీ ఎమోజీని షేర్ చేశాడు. మరి ఈ ప్రాజెక్ట్ నుంచి మనోజ్ తప్పుకున్నాడా? లేక మరైదేనా సినిమా అనౌన్స్ చేయనున్నాడా అన్నది చూడాల్సి ఉంది.
Adios amigo 🙌🏽 pic.twitter.com/vSSnbL0Sxd
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 8, 2022