కొత్త లుక్‌లో కోహ్లి! | Virat Kohli  New Hairstyle | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 20 2018 8:05 PM | Last Updated on Tue, Mar 20 2018 8:05 PM

Virat Kohli  New Hairstyle - Sakshi

విరాట్‌ కోహ్లి

సాక్షి, స్పోర్ట్స్‌ : స్పోర్ట్స్ స్టార్స్ ఎప్పటికప్పుడు తమ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్‌ను మారుస్తూ కొత్త ట్రెండ్‌ సృష్టిస్తుంటారు. ఇలా ఓ సరికొత్త ఫ్యాషన్‌ని సెట్ చేయడంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే భిన్న హేయిర్‌ స్టైల్‌, టాటూలతో రాక్‌స్టార్‌ను తలిపించే కోహ్లి మరోసారి తన హెయిర్‌ స్టైల్‌ను మార్చేశాడు. ఈ విషయాన్ని కోహ్లి స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. ‘స్టైల్‌ మాస్టర్‌ ఆలిమ్‌ మాలిక్‌ చేసిన గొప్ప కటింగ్‌’ అనే క్యాఫ్షన్‌తో ఫొటోను ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. గతంలోనే కోహ్లి కటింగ్‌ను అనుసరించిన అభిమానులకు తాజా కటింగ్‌ మరింత ఆకట్టుకుంటోంది. 

ఈ నెలలోనే కోహ్లి తన భుజంపై కొత్త టాటూ వేయించుకున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం దొరికిన విశ్రాంతిని ఆస్వాదిస్తున్న కోహ్లి మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ సన్నదమవుతున్నాడు. ఈ సీజన్‌లో కోహ్లి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 7న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement