new hair style
-
ఐపీఎల్ కోసం కోహ్లి న్యూ లుక్.. అదిరిపోయిందిగా! ఫోటో వైరల్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్-2024 సీజన్‌తో విరాట్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఆర్సీబీ జట్టుతో కలిసిన కోహ్లి.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు కింగ్ కోహ్లి న్యూ లుక్‌లో కన్పించాడు. ఎప్పటికప్పుడు సరికొత్త హెయిర్ స్టైల్‌తో అభిమానులను అకట్టుకునే విరాట్.. ఇప్పుడు మరో కొత్త హెయిర్ స్టైల్లో దర్శనిమిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా కోహ్లికి హెయిర్ స్టైల్ చేసింది ఎవరో కాదు.. సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ అలీమ్ హకీమ్. మన దేశంలో టాప్ సెలెబ్రిటీలకు అతడే హెయిర్ స్టైలింగ్ చేస్తుంటాడు. గత సీజన్ ఆరంభానికి ముందు విరాట్ కొత్త హెయిర్ స్టైల్లో కన్పించాడు. అది చేసినది కూడా అలీమ్ హకీమే కావడం గమనార్హం. ఇక ఐపీఎల్ 17వ సీజన్లో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ క్యాష్‌రిచ్ లీగ్ ఆరంభానికి ముందు ఆర్సీబీ ఆన్‌బాక్స్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. మార్చి 19(మంగళవారం) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో విరాట్ సందడి చేయనున్నాడు. 𝑽𝒊𝒓𝒂𝒕 𝑲𝒐𝒉𝒍𝒊 gets a new look 💇 📸: Aalim Hakim pic.twitter.com/QbClloVr80 — CricTracker (@Cricketracker) March 19, 2024 -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హాట్ బ్యూటీ..
-
సంజయ్ దత్ నయా లుక్
నయా (కొత్త) లుక్‌లో సంజయ్ దత్ తన అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చారు. ఆయనకు క్యాన్సర్ అని నిర్ధారణ కాగానే అభిమానులు చాలా బాధపడ్డారు. ’మా సంజూ బాబాకి ఏం కాదు.. త్వరలోనే క్యాన్సర్‌ని జయిస్తారు’ అని అభిమానులు పేర్కొన్నారు. అన్నట్లుగానే సంజయ్ దత్ త్వరగా ఈ మహమ్మారి నుంచి బయటపడ్డారు. ’నేను క్యాన్సర్‌ని జయించాను’ అని అధికారికంగా చెప్పి, అందర్నీ ఆనందపరిచారు సంజయ్ దత్. తాజాగా నయా లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ముంబైలోని ప్రముఖ హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్ హకీమ్ సెలూన్‌కి వెళ్లి, కొత్త హెయిర్ స్టయిల్ చేయించుకున్నారు సంజయ్ దత్. ఆ ఫొటోను హకీమ్ షేర్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం హిందీలో షంషేరా, పృథ్వీరాజ్ చిత్రాలు చేస్తున్నారు సంజయ్ దత్. అలాగే ‘కేజీఎఫ్’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘కేజీఎఫ్ 2’లో నటిస్తున్నారు. -
కొత్త లుక్‌లో కోహ్లి!
సాక్షి, స్పోర్ట్స్ : స్పోర్ట్స్ స్టార్స్ ఎప్పటికప్పుడు తమ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్‌ను మారుస్తూ కొత్త ట్రెండ్ సృష్టిస్తుంటారు. ఇలా ఓ సరికొత్త ఫ్యాషన్‌ని సెట్ చేయడంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే భిన్న హేయిర్ స్టైల్, టాటూలతో రాక్‌స్టార్‌ను తలిపించే కోహ్లి మరోసారి తన హెయిర్ స్టైల్‌ను మార్చేశాడు. ఈ విషయాన్ని కోహ్లి స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. ‘స్టైల్ మాస్టర్ ఆలిమ్ మాలిక్ చేసిన గొప్ప కటింగ్’ అనే క్యాఫ్షన్‌తో ఫొటోను ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. గతంలోనే కోహ్లి కటింగ్‌ను అనుసరించిన అభిమానులకు తాజా కటింగ్ మరింత ఆకట్టుకుంటోంది. ఈ నెలలోనే కోహ్లి తన భుజంపై కొత్త టాటూ వేయించుకున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం దొరికిన విశ్రాంతిని ఆస్వాదిస్తున్న కోహ్లి మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ సన్నదమవుతున్నాడు. ఈ సీజన్లో కోహ్లి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 7న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభం కానుంది. Great cut from the style master @AalimHakim👌 pic.twitter.com/mGiPVrjiC5 — Virat Kohli (@imVkohli) 20 March 2018 -
నెత్తిన నిప్పుల కుంపటి
-
నెత్తిన నిప్పుల కుంపటి
మీరు చూస్తున్నది నిజమే. ప్రస్తుతం ఈ వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. మన దేశంలోని ఓ హెయిర్ సెలూన్లో జుత్తుకు నిప్పంటించి కటింగ్ చేస్తున్న వీడియో ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ క్షురకుడు ఏం చేశాడంటే.. కస్టమర్ రాగానే.. జుత్తు మీద మండే స్వభావం ఉన్న ఓ పౌడర్, ద్రవాన్ని వేశాడు. తర్వాత తన వద్దనున్న లైటర్‌తో అంటించేశాడు. జుత్తు మండుతుండగానే.. అందరూ నోరెళ్లబెట్టి చూస్తుండగానే.. చేతిలోకి రెండు దువ్వెనలు తీసుకుని.. తాను అనుకున్న స్టైల్ కు తగ్గట్లు కట్‌చేసి.. షేప్‌లోకి తెచ్చేశాడు. ఇలా రెండు సార్లు అంటించాడు. గతంలోనూ మన దేశంలో కొందరు క్షురకులు కొవ్వొత్తిని అంటించి.. ఆ మంటతో కటింగ్ చేయడం తెలిసిందే. అయితే.. ఇది నెత్తి మీదే మంటపెట్టి చేయడం మాత్రం ఇదే తొలిసారి. అయితే.. ఇతడు ఏ ఊరుకు చెందినవాడన్న వివరాలు తెలియరాలేదు.