ఐపీఎల్‌ కోసం కోహ్లి న్యూ లుక్‌.. అదిరిపోయిందిగా! ఫోటో వైరల్‌ | Virat Kohli gets a new hairstyle ahead of IPL 2024 | Sakshi
Sakshi News home page

IPL 2024: ఐపీఎల్‌ కోసం కోహ్లి న్యూ లుక్‌.. అదిరిపోయిందిగా! ఫోటో వైరల్‌

Published Tue, Mar 19 2024 2:00 PM | Last Updated on Tue, Mar 19 2024 2:56 PM

Virat Kohli gets a new hairstyle ahead of IPL 2024 - Sakshi

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్‌-2024 సీజన్‌తో విరాట్‌ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఆర్సీబీ జట్టుతో కలిసిన కోహ్లి.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు ముందు కింగ్‌ కోహ్లి న్యూ లుక్‌లో కన్పించాడు.

ఎప్పటికప్పుడు సరికొత్త హెయిర్​ స్టైల్‌తో అభిమానులను అకట్టుకునే విరాట్‌.. ఇప్పుడు మరో కొత్త హెయిర్​ స్టైల్‌లో దర్శనిమిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా కోహ్లికి హెయిర్​ స్టైల్​ చేసింది ఎవరో కాదు.. సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ అలీమ్ హకీమ్‌.

మన దేశంలో టాప్ సెలెబ్రిటీలకు అతడే హెయిర్ స్టైలింగ్ చేస్తుంటాడు. గత సీజన్‌ ఆరంభానికి ముందు విరాట్‌ కొత్త హెయిర్​ స్టైల్‌లో కన్పించాడు. అది చేసినది కూడా అలీమ్ హకీమే కావడం గమనార్హం. ఇక ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 22న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడనుంది.

ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌ ఆరంభానికి ముందు ఆర్సీబీ ఆన్‌బాక్స్‌ ఈవెంట్‌ను నిర్వహించనుంది. మార్చి 19(మంగళవారం) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ ఈవెంట్‌ జరగనుంది.  ఈ కార్యక్రమంలో విరాట్‌ సందడి చేయనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement