కరోనా లాక్‌డౌన్ కారణంగా దొరికిన అనూహ్య సమయాన్ని టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన పిల్లలతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. సాధారణంగానే సినిమా షూటింగ్‌ల సమయంలో ఏ కాస్త విరామం దొరికినా ఇంట్లో వాలిపోతాడు. ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో తన పిల్లలతో కలిసి చేసే అల్లరి పనులను ఎప్పటికప్పుడు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇటీవల్ సితార పాప కోసం మహేశ్ ఓ పాట పాడుతూ నవ్వించిన వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తాజాగా నమ్రత తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో చూపరులను తెగ ఆకట్టుకుంటోంది. గౌతమ్, సితారలతో కలిసి మహేశ్ సెల్ఫీ దిగిన ఫోటోను నమ్రత షేర్ చేశారు. ఈ ఫోటోలో సూపర్‌స్టార్ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. కళ్ల జోడు పెట్టుకొని చాలా క్యూట్‌గా ఉన్న మహేశ్ లుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా మహేశ్ తన తదుపరి చిత్రం పరుశురామ్ డైరెక్షన్‌లో ఓ లవ్‌స్టోరీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే మీసాలు లేకుండా, కూల్‌గా, కాలేజీ స్టూడెంట్‌లా తన లుక్‌ను మార్చుకున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
చదవండి:
మహేశ్ కాదనడంతో చరణ్‌తో..
అమెజాన్‌లో అనుష్క సినిమా..
Comments
Please login to add a commentAdd a comment