రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని, వాటిల్లో ఒకటి విద్యార్థి కాగా, మరొకటి ప్రభుత్వోద్యోగి అని టాక్. అయితే ఇప్పటికీ ఈ మూవీ టైటిల్ ఖారారు కాలేదు. ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’, ‘సర్కారోడు’, ‘అధికారి’ వంటి టైటిల్స్‌ను చిత్ర బృందం పరిశీలిస్తుందని వినికిడి.
చదవండి: మూవీ సక్సెస్.. దర్శకుడికి మాయోన్ మూవీ నిర్మాత సర్‌ప్రైజ్ గిఫ్ట్
అయితే శంకర్ సినిమా అంటే అందులో హీరోలు విభిన్న లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా ఇందులో చరణ్ లుక్‌పై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రంలోని చరణ్‌కు సంబంధించిన ఓ షాకింగ్ లుక్ బయటకు వచ్చింది. చరణ్‌కు మేకప్ చేస్తున్న వీడియో క్లిప్ ఇది. ఇందులో చెర్రిని సగం మాత్రమే కనిపించేలా వీడియోను వదిలారు. గుబురు గడ్డం, కళ్ల జోడుతో సరికొత్త లుక్‌లో దర్శనం ఇచ్చాడు చరణ్. ఇక సినిమా షూటింగ్‌కు వెళ్లే ముందు టచప్ చేస్తున్నట్లుగా ఈ వీడియో క్లిప్ ఉండటంతో మెగా ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు.
A New Vibe , A New Hairstyle, A New Look and Definitely A New #RamCharan 🔥🔥#RC15 RAMpage ⏳#ManOfMassesRamCharan @AlwaysRamCharan pic.twitter.com/RE3umDJjjo
— SivaCherry (@sivacherry9) July 2, 2022
Comments
Please login to add a commentAdd a comment