కపిల్‌ దేవ్‌ గుండు.. ఆమే కారణం! | Kapil Dev New Bold Look Daughter Amiya Is The Reason | Sakshi
Sakshi News home page

కపిల్‌ దేవ్‌ గుండు.. ఆమే కారణం!

Published Wed, Apr 22 2020 7:57 PM | Last Updated on Wed, Apr 22 2020 8:09 PM

Kapil Dev New Bold Look Daughter Amiya Is The Reason - Sakshi

న్యూలుక్‌తో కపిల్‌ దేవ్‌

కరోనా వైరస్‌ కష్టాలు పేద వారికే కాదు సంపన్నులకు, సెలబ్రెటీలకు కూడా తప్పటం లేదు. ఏదో ఒక విషయంలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులకు గురవుతున్నారు.  తాజాగా భారత క్రికేట్‌ జట్టు మాజీ సారథి కపిల్‌ దేవ్ లాక్‌డౌన్‌ కారణంగా కూతురితో చేయించుకున్న హేయిట్‌ కట్ వికటించి‌, నున్నగా గుండు గీయించుకోవాల్సి వచ్చింది. తన న్యూలుక్‌ గురించి మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ జుట్టు బాగా పెరగటంతో అమియా(కూతరు)ను హేయిర్‌ కట్‌ చేయమని అడిగాను. తను నా జుట్టును చాలా చిన్నగా కత్తిరించింది. దీంతో నేను పూర్తిగా గుండు గీయించుకుని, ఫ్రెంచ్‌ బియర్డ్‌ పెట్టుకున్నాన’’ని చెప్పారు. ( కాల్చిపారేయండి: ట్రంప్‌ వార్నింగ్‌ )

అనంతరం లాక్‌డౌన్‌ అనుభవాలను పంచుకుంటూ.. ‘‘ ప్రస్తుతం ఇంట్లో వారికి అన్ని రకాలుగా సహయపడుతున్నాను. రోమీ(భార్య), అమియాలకు చేదోడువాదోడుగా ఉంటున్నాను. ఇంటి పనుల్లోనూ, వంట పనుల్లోనూ సహాయపడుతున్నా. నా షూలను పాలిష్‌ చేసుకోవటం మాత్రం నావల్ల కావటం లేద(నవ్వుతూ)’’ని అన్నారు. కాగా, కపిల్‌ న్యూలుక్‌పై స్పందించిన మాజీ భారత క్రికేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌. కపిల్‌ న్యూలుక్‌ తనకెంతో నచ్చిందని, దాన్నలగే కొనసాగించాలని కోరారు. ( గాళ్‌ఫ్రెండ్‌ ప్రేమను ఒప్పుకుందేమో అందుకే.. )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement