అదిరెన్.. రజనీ స్టయిల్ | This is Rajinikanth's new look for Endhiran 2 | Sakshi
Sakshi News home page

అదిరెన్.. రజనీ స్టయిల్

Published Mon, Dec 28 2015 4:26 PM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

అదిరెన్.. రజనీ స్టయిల్

అదిరెన్.. రజనీ స్టయిల్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిలే వేరు. వినూత్న గెటప్లు, తనదైన స్టయిల్తో అభిమానులకు కనువిందు చేస్తుంటాడు. ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రోబో సీక్వెల్ రోబో 2 చిత్రంలో రజనీకాంత్ సరికొత్తగా కనిపించనున్నారు.

ఈ చిత్రంలో రజనీకాంత్కు ఫ్యాషన్ డిజైనర్ రాకీ కాస్ట్యూమ్స్ అందిస్తున్నారు. రోబో 2 సెట్స్పై రజనీకాంత్తో దిగిన ఫొటోను రాకీ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో రజనీకాంత్ గళ్ల చొక్కా, జాకెట్ ధరించి.. చిన్న గడ్డం, మాంచి హెయిర్ స్టయిల్తో కనిపిస్తాడు. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలోనే రజనీకాంత్, ఐశ్వర్యా రాయ్ జంటగా నటించిన సైంటిఫిక్ మూవీ రోబో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా రోబో 2 లో ఐశ్వర్యా రాయ్ బదులు ఎమీ జాక్సన్ రజనీ  కాంత్ సరసన నటిస్తోంది. భారత చిత్ర పరిశ్రమలోనే 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement