అనుష్క మారిపోయిందోచ్..! | Anushka Shetty New Look | Sakshi
Sakshi News home page

అనుష్క మారిపోయిందోచ్..!

Nov 28 2017 12:38 PM | Updated on Nov 28 2017 12:39 PM

Anushka Shetty New Look - Sakshi - Sakshi

కొద్ది రోజులుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న స్వీటీ, సైజ్ జీరో సినిమా కోసం చేసిన ప్రయోగం కెరీర్ మీదే ప్రభావం చూపించింది. ఆ సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క తరువాత తగ్గేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక దశలో ఇక అనుష్క కెరీర్ ముగిసినట్టే అన్న ప్రచారం కూడా జరిగింది.

సింగం 3, ఓం నమో వేంకటేశాయ సినిమాల్లో అనుష్క లుక్ పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ప్రస్తుతం భాగమతి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న స్వీటీ ఓ ఆసక్తికర ఫొటోతో అభిమానులకు షాక్ ఇచ్చింది. హెయిర్ స్టైల్ మార్చి బాబ్ కట్ లో స్లిమ్ గా పూర్తిగా న్యూలుక్ లో దర్శన మిచ్చింది అనుష్క. ఫొటోతో పాటు 'కలలు మాయలతో నిజం కావు. కఠోర శ్రమ, నిబద్ధతతో చెమట చిందిస్తేనే కలలు సాకారమవుతాయి' అంటూ కామెంట్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement