
‘జర్నీ’ అంతటి పేరొస్తుంది
‘‘జర్నీ’ నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సినిమా. ఆ సినిమా తర్వాత మళ్లీ నాకు అంత మంచి రోల్ ఇచ్చిన మురుగదాస్‌కి ధన్యవాదాలు.
‘‘జర్నీ’ నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సినిమా. ఆ సినిమా తర్వాత మళ్లీ నాకు అంత మంచి రోల్ ఇచ్చిన మురుగదాస్‌కి ధన్యవాదాలు. నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్ అవుతుంది’’ అని అంజలి చెప్పారు. దర్శకుడు మురుగదాస్ సోదరుడు దిలీపన్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘వట్టికుచ్చి’ తెలుగులో ‘ప్రాణంకోసం’గా వస్తోంది. అంజలి కథానాయిక. పి.కిన్‌స్లిన్ దర్శకుడు. సంరెడ్డి రాజశేఖరరెడ్డి, ఎం.వెంకట్రావ్ ఈ అనువాద చిత్రానికి నిర్మాతలు. ఎం.గీబ్రన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ్ ఆడియోసీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని టి.ప్రసన్నకుమార్‌కి అందించారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. ఇంకా దిలీపన్ మాట్లాడారు.