ఆటో పల్టీ... ఒకరి దుర్మరణం | one women died due to the road accident | Sakshi

ఆటో పల్టీ... ఒకరి దుర్మరణం

Oct 19 2013 3:10 AM | Updated on Aug 29 2018 4:16 PM

తివేగం... అజాగ్రత్త.. సామర్థ్యానికి మించిన ప్రయాణం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పత్తి ఏరేందుకు కూలీలను తీసుకెళుతున్న ఆటో ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను అధిగమించబోయి పల్టీ కొట్టింది.

 శాలిగౌరారం, న్యూస్‌లైన్: అతివేగం... అజాగ్రత్త.. సామర్థ్యానికి మించిన ప్రయాణం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పత్తి ఏరేందుకు కూలీలను తీసుకెళుతున్న ఆటో ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను అధిగమించబోయి పల్టీ కొట్టింది. ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందడంతో పాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ఎన్‌జీ కొత్తపల్లి సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని ఎన్ జీ కొత్తపల్లికి చెందిన కూలీలు భైరవునిబండ గ్రామంలో పత్తి ఏరేందుకు ఆటో ఎక్కారు. అందులో 20 మందికి పైగా కూలీ లు ఉన్నారు. అతివేగంగా వెళ్తున్న ఆటో భైరవునిబండ-తక్కెళ్లపహాడ్ క్రాస్‌రోడ్డు సమీపంలో ముందువెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయబోయి పల్టీకొట్టింది.
 
 ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సిరుపంగి లింగమ్మ(52) అక్కడికక్కడే మృతి చెందగా కొమ్ము లక్ష్మమ్మ, ఓగోటి అనసూర్య, గూడపూరి ఎల్లమ్మ, గద్దల సంతోష, సిరుపంగి పిచ్చ మ్మ, ఓగోటి పద్మలకు గాయాల య్యాయి. క్షతగాత్రులను మరో ఆటోలో నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు సిరుపంగి కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఏఎస్‌ఐ సత్తిరెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement