భారాన్ని తగ్గించుకునేందుకు అనిల్ ప్లాన్స్ ఇవే!
భారాన్ని తగ్గించుకునేందుకు అనిల్ ప్లాన్స్ ఇవే!
Published Fri, Jun 2 2017 6:39 PM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM
ఆర్ కామ్ కు అప్పుల కుప్పతో మారిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.45వేల కోట్లను ఇది బ్యాంకర్లకు బాకీ పడింది. ఈ భారీ రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలను రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ శుక్రవారం మీడియా సమావేశంలో వివరించారు. ఎయిర్ సెల్ విలీనం, బ్రూక్ ఫీల్డ్ కు టవర్ ఆస్తుల విక్రయం ఆర్ కామ్ రుణాన్ని 60 శాతం తగ్గిస్తాయని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ చెప్పారు. ఆర్ కామ్ రుణం రూ.45కోట్ల మేర ఉందని, ఈ రుణాన్ని తగ్గించుకునే ప్రణాళికలను బ్యాంకర్లుఆమోదించారని అనిల్ అంబానీ తెలిపారు. ఈ రెండు డీల్స్ ను పూర్తి చేసుకోవడానికి తమ వద్ద డిసెంబర్ వరకు సమయముందని చెప్పారు. ''లెండర్లందరితో మేము మీటింగ్ నిర్వహించాం. మా ప్లాన్స్ వివరించాం. వాటిని లెండర్లు ఆమోదించారు. కంపెనీ వద్ద రుణాన్ని తగ్గించుకోవడానికి ఏడు నెలల సమయముంది'' అని తెలిపారు.
ఒకవేళ అప్పటికి కూడా రుణాన్ని తగ్గించుకోలేని పక్షంలో రుణాన్ని పునర్వ్యస్థీకరించుకునేందుకు వీలుగా ఆర్బీఐ ప్రొవిజన్స్ ఉన్నాయని, వాటిని అప్లై చేస్తామని చెప్పారు. ఇదేసమయంలో ఎయిర్ సెల్- ఆర్ కామ్ విలీనానికి కూడా డిసెంబర్ వరకు లెండర్లు సమయమిచ్చినట్టు, దీంతో విలీనసంస్థ ఎయిర్ కామ్ గా మారనుందని పేర్కొన్నారు. విలీనం అనంతరం కొత్త వైర్ లెస్ కంపెనీలో 50 శాతం స్టాక్ ను ఆర్ కామ్ కలిగి ఉంటుందని తెలిపారు. ఎయిర్ సెల్ విలీనం, బ్రూక్ ఫీల్డ్ కు స్టాక్ ను అమ్మే డీల్స్ అనంతరం అంటే సెప్టెంబర్ 30కి ముందే రూ.25వేల కోట్ల రుణాన్ని బ్యాంకులకు తిరిగి చెల్లిస్తామని వాగ్ధానం చేశారు. రుణాన్ని ఈక్విటీలోకి మార్చే ప్రతిపాదనేమీ లేదని స్పష్టంచేశారు. కంపెనీకి రేటింగ్ ఏజెన్సీల ఇస్తున్న డౌన్ గ్రేడింగ్ పై అనిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
Advertisement
Advertisement