వర్రీ.. డూ జర్నీ! | Worry-Do Journey | Sakshi
Sakshi News home page

వర్రీ.. డూ జర్నీ!

Published Thu, Apr 30 2015 11:40 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

వర్రీ.. డూ జర్నీ!

వర్రీ.. డూ జర్నీ!

వేసవిలో స్కూల్ ఉండదు. పుస్తకాలతో పని ఉండదు. పిల్లల అల్లరికి హద్దులుండవు. వారి అల్లరిని కట్టడి చేయడానికి చూడచక్కని ప్రదేశాలకు వెళ్లాలని, కుటుంబమంతా ఆనందంగా గడపాలని పెద్దలు ప్రణాళికలు వేసుకుంటారు. అవన్నీ ఎలా ఉన్నా ప్రయాణ జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం చాలా విహారం కాస్త విసుగ్గా అనిపిస్తుంది. ముందస్తుగా తీసుకునే జాగ్రత్తలు విహారాన్ని మరింత ఆనందాన్ని మార్చేస్తుంది.
 
 1     మీరే ఒక ట్రావెల్ సెంటర్ అవ్వండి...

ఒక ప్రాంతానికి వెళ్లేటప్పుడు అక్కడి వాతావరణం, ఉండదగిన చోటు... దానికి తగ్గ ఏర్పాట్లతో ఒక జాబితాను రూపొందించండి. విమానాశ్రయ ఫోన్ నెంబర్లు, కార్ అద్దెకు ఇచ్చే కేంద్రాల ఏజెంట్ల నెంబర్లతో పాటు టికెట్, పాస్‌పోర్టు, ఆధార్‌కార్డు,..ల నెంబర్లన్నీ ఒక వైపు  రాసుకోవాలి. అలాగే, ప్రయాణానికి కేంద్రబిందువుగా ఉండే ప్రాంతం, పర్యటించాల్సిన ప్రాంతాల జాబితాతో పాటు వ్యక్తిగత లగేజీ ప్యాకింగ్ లిస్ట్..మీ నోట్‌బుక్‌లో రాసుకున్న జాబితాను అనుసరించి కుటుంబంలోని వారికి సూచనలు ఇవ్వాలి.  టికెట్స్, పాస్‌పోర్ట్, ట్రావెల్ డాక్యుమెంట్స్, ప్రయాణానికే ప్రత్యేకమైన టాయిలెట్ వస్తువులు, టిష్యూ పేపర్లు, ఇతర ప్రయాణ వస్తువులు, వ్యక్తిగతంగా తీసుకెళ్లదలచినవి.. ఇలా జాబితా ప్రకారం అన్ని వస్తువులను నీటుగా సర్దాలి.
 
2 తేలికైనదే ఎప్పుడూ సరైనది...

పాత కాలంలో లాగా బరువైన వస్తువులన్నీ వెంట మోసుకెళ్లకుండా ‘ఎంత తేలికైనది అయితే అంత ఎక్కువ ప్రయోజనం’ అనే సూత్రానికి సిద్ధమవ్వండి. చాలా వరకు ఉపయోగించి, పడేసే వస్తువులను వెంట తీసుకెళ్లడం సముచితం. అవి కూడా పర్యావరణ హితమైన ట్రావెల్ వస్తువులు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. వాటిపై దృష్టి పెట్టడం మంచిది. ఏమాత్రం బరువు లేని థెర్మల్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్.. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గాన వెళ్లేవారికి ఈ బ్యాక్‌ప్యాక్స్ తేలికగానే కాదు, ఎంతో సౌలభ్యంగా ఉంటాయి.
 
3 పిల్లల కోసం ప్రత్యేకం...

ప్రయాణంలో పిల్లలు సులువుగా తినడానికి వీలున్న ఆహారాన్ని తీసుకెళ్లడం అందరూ చేసేపనే. అయితే, వీటి కోసం ప్రత్యేకించి బ్యాగులు అవసరం లేకుండా ధరించిన దుస్తులకే ఎక్కువ పాకెట్స్ ఉన్నవి ఎంచుకోవడం మేలు. లేదా, ‘బ్యాక్ ప్యాక్ బ్యాగ్’లో వేసి పిల్లలకే ఇస్తే వారు దానిని ఆనందంగా వెంట తీసుకెళ్లడానికి ఇష్టపడతారు. ఆ విధంగా పిల్లలనీ ప్రయాణపు పనుల్లో అవకాశం కల్పించినట్టూ ఉంటుంది.
 
 4 వేడిని ఎదుర్కోండిలా...

ప్రయాణంలో ఎండ, కాలుష్యం.. ఇతరత్రా పిల్లలు-పెద్దల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. 15 నిమిషాలకు ఒకసారి శుభ్రమైన నీరుతాగేలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే గంటకు ఒకసారి ఎస్.పి.ఎఫ్ 30 శాతం గల సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. వాహనాల్లో ఉన్నప్పటికీ ఈ లోషన్ తప్పనిసరి. ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నీటి శాతం ఎక్కువ గల తాజా పండ్లు, శాఖాహార భోజనానికే అధిక ప్రాముఖ్యమివ్వాలి. నూనె, వేపుడు పదార్థాలను సాధ్యమైనంతవరకు ప్రయాణంలో దూరంగా ఉంచడమే మంచిది. బయట వేడి అధికంగా ఉంది కదా అని పిల్లలను వాహనాల్లోనే ఒంటరిగా వదిలి వె ళ్లడానికి ప్రయత్నించకండి.
 
5 మెడికల్ కిట్ తప్పనిసరి...

విహారంలో పిల్లలలకు రాత్రి సమయాల్లో కీటకాలు కుట్టినప్పుడు దురదలు వస్తాయి. వెంటనే వాటికి విరుగుడుగా యాంటీబయాటిక్ లోషన్లు వాడాలి. అలాగే చెవుల్లోకి, ముక్కులోకి కీటకాలు దూరుతుంటాయి. రోడ్డు మార్గాన నడిచినప్పుడు పాదాలకు ముళ్లు గుచ్చుకోవడం మామూలే! ఇలాంటప్పుడు, వాటిని తీయడానికి టీజర్లు తీసుకెళ్లాలి. పిల్లలు మోచేతులకు, మోకాళ్లకు దెబ్బలు తగిలించుకోవడం సహజమే! వెంటనే ప్రాధమిక చికిత్స అందించేందుకు వీలుగా దూది, కత్తెర, బ్యాండేయిడ్.. ఉండాలి. అత్యవసర సాధనాలతో కూడిన కిట్ వెంట ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఇందుకోసం మార్కెట్లో ట్రావెల్ మెడికల్ కిట్స్ లభిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement