వేములవాడకు ఎల్లంపల్లి నీళ్లు
మేడిపెల్లి: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వేములవాడ నియోజకవర్గంలోని భూములకు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు తెలిపారు. గురువారం మేడిపెల్లి, కట్లకుంటలో ‘మన ఊరు-మన ప్రణాళిక’పై జరిగిన గ్రామసభల్లో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని 97 వేల ఎకరాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. చందుర్తి మండలం రుద్రంగి శివారులో ఉన్న చెరువును నింపి కథలాపూర్, మేడిపెల్లి మండలాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. అధికారులు అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రణాళికలు తయారు చేయాలన్నారు.
మేడిపెల్లిలో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, జెడ్పీటీసీ నెల్లుట్ల పూర్ణిమ, ఎంపీపీ పల్లి జమున, నియోజకవర్గ ఇన్‌చార్జి అంబయ్య, మండల పరిశీలకుడు శాంతికుమార్, తహశీల్దార్ వసంత, ఎంపీడీవో సుందరవరదరాజన్, ఎంఈవో జితేందర్‌రావు, సర్పంచులు బొంగోని రాజాగౌడ్, గౌరి భూమయ్య, రాములు, అంగడి ఆనందం, చెట్ట గంగరాజు, ఎంపీటీసీలు కుందారపు అన్నపూర్ణ, దాసరి శంకర్, సురకంటి విజయనారాయణరెడ్డి, భూమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.