- 22విఎస్‌సీ1120:- జిల్లాకలెక్టర్ యువరాజ్
- పరిశ్రమలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
- పెండింగ్,ప్రతిపాదిత ప్రాజెక్ట్‌ల పూర్తికి చర్యలు
- కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ యువరాజ్
సాక్షి, విశాఖపట్నం: రానున్న ఆర్థిక సంవత్సరంలో 19.13 శాతం అభివృద్ధిరేటు సాధించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ యువరాజ్ వెల్లడించారు. హైదరాబాద్‌లో కేబినెట్ సమావేశానంతరం సీఎంచంద్రబాబు నాయుడు కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ యువరాజ్ జిల్లాలో అభివృద్ధి పెంపునకు రూపొంచిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ వివరాలను శుక్రవారం రాత్రి విశాఖపట్నంలో స్థానిక విలేకరులకు విడుదల చేశారు.
జిల్లా జీడీడీపీలో 61 శాతం సర్వీస్ సెక్టార్ నుంచే వస్తుందని.. ఈ రంగాన్ని మరింత బలోపేతానికి చర్యలు చేపట్టామన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. అలాగే పరిశ్రమలసెక్టార్‌లో 2013-14లో రూ.19,903కోట్లు కాగా, 2014 -15లో రూ.21,654కోట్లు కాగా, 2015-16లో రూ.25,091కోట్లు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇక అన్నింటికంటే ప్రధాన ప్రాధాన్యతా రంగమైన సేవా రంగంలో 2013-14లో రూ.39,945కోట్లు కాగా, 2014-15లో రూ.45,321 కోట్లుగా ఉందని, 2015-16లో రూ.54,745కోట్లు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రూ.7455కోట్లు పారిశ్రామిక రంగం ద్వారా రూ.25,091కోట్లు, సేవా రంగం ద్వారా రూ.14,061కోట్లు అదనపు ఆదాయం రాబట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో ఈ ఏడాది కొత్తగా 6,272కోట్లతో 746పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయని, వీటి ద్వారా 9819 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు చెప్పారు.
రుషికొండలో 1,2,3 హిల్స్‌లో మెగా ఐటీ హబ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని, అలాగే విశాఖలో సిగ్నేచర్ ఐటీటవర్, ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్, హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రానున్న ఆర్థికసంవత్సరంలో రూ.6వేల కోట్లతో కాఫీ ప్లాంటేషన్‌కు చర్యలు చేపట్టామన్నారు. పర్యాటక రంగం పరంగా రూ.12.75కోట్లతో కైలాసగిరిపై తెలుగు కల్చరల్ హరిటేజ్ మ్యూజియం, రూ.30కోట్లతో క్రూయిజ్ టూరిజం డెవలప్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇందుకోసం పెండింగ్,ప్రతిపాదిత ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేయడం, ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంచడం, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్లడం వంటి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
జిల్లా జీడీపీ 19.13 శాతం లక్ష్యం
Published Sat, May 23 2015 5:01 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement