న్యూఢిల్లీ : ఫుడ్, ఆయుర్వేద్ మెడిసిన్, కాస్మటిక్స్, హోమ్ కేర్, పర్సనల్ కేర్ విభాగాల్లో ఉత్పత్తుల్లో దూసుకుపోతున్న పతంజలి తాజాగా టెలికాం మార్కెట్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘స్వదేశీ సమృద్ధి’ పేరిట సిమ్‌లను కూడా బాబా రాందేవ్ మార్కెట్‌లోకి విడుదల చేశారు. ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌తో జత కట్టిన రాందేవ్, ఈ పతంజలి సిమ్ కార్డులను తీసుకొచ్చారు. ఇప్పటికే రిలయన్స్ జియో ఎంట్రీతో అతలాకుతలమవుతున్న టెలికాం మార్కెట్, పతంజలి సిమ్ కార్డుల ఎంట్రీతో ఈ రంగంలో మరింత పోటీ నెలకొనబోతోంది.
తొలిదశలో పతంజలి ఉద్యోగులు, కార్యాలయ సిబ్బందికే ప్రవేశపెట్టనున్న ఈ సిమ్ కార్డు ప్లాన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- పతంజలి బీఎస్‌ఎన్‌ఎల్ రూ.144 ప్లాన్. ఈ ప్లాన్ వాలిడిటీ నెల రోజులు. దీనిపై అపరిమిత వాయిస్ ఆల్‌ఇండియా రోమింగ్, రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందనున్నారు.
- పతంజలి బీఎస్‌ఎన్‌ఎల్ స్పెషల్ ప్లాన్ ఓచర్- రూ.792. ఈ ప్లాన్ వాలిడిటీ 6 నెలలు. దీనిపై అపరిమిత వాయిస్ ఆల్‌ఇండియా రోమింగ్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు.
- రూ.1584తో పతంజలి బీఎస్‌ఎన్‌ఎల్ స్పెషల్ ప్లాన్ ఓచర్ -1584. ఈ ప్లాన్ వాలిడిటీ ఏడాది. దీనిపై అపరిమిత వాయిస్ ఆల్‌ఇండియా రోమింగ్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు.
బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన ఐదు లక్షల కౌంటర్ల ద్వారా త్వరలో వినియోగదారులు పతంజలి సిమ్ కార్డులను పొందొచ్చని రాందేవ్ బాబా చెప్పినట్లు ‘ఏఎన్‌ఐ’ వార్తా సంస్థ తెలిపింది. సిమ్ కార్డులను పూర్తిస్థాయిలో మార్కెట్‌లోకి తెచ్చిన తర్వాత.. స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డ్ తీసుకున్నవారు పతంజలి ప్రొడక్టులపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చని ఏఎన్‌ఐ పేర్కొంది. అలాగే ఆరోగ్య, ప్రమాద, జీవిత బీమా ప్రయోజనాలూ ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment