న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో దేశీ, అంతర్జాతీయ మార్కెట్లలో 30 శాతం వాటాను సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఎయిరిండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు. కంపెనీకి ఇప్పుడు దేశీయంగా 10 శాతం, అంతర్జాతీయంగా 12 శాతం మార్కెట్ వాటా ఉంది. పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకునే దిశగా ఎయిరిండియా ప్రస్తుతం కసరత్తు చేస్తోందని, మంచి పురోగతి కనిపిస్తోందని విల్సన్ వివరించారు.
వచ్చే అయిదేళ్లలో తమ విమానాల సంఖ్యను మూడు రెట్లు పెంచుకోనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే 15 నెలల్లో 5 వైడ్-బాడీ బోయింగ్, 25 ఎయిర్‌బస్ చిన్న విమానాలను సమకూర్చుకోనున్నట్లు వివరించారు. ఎయిరిండియాను టాటా గ్రూప్ ఈ ఏడాది జనవరిలో టేకోవర్ చేసింది. కంపెనీని తిరిగి లాభాల బాట పట్టించడానికి విహాన్‌డాట్‌ఏఐ పేరిట పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికను అమలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment