హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరికొత్త టెక్నాలజీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా యువతను ఆకర్షించే విధంగా దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా మొబైల్ వాలెట్, కొత్త యాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వచ్చే రెండేళ్ళలో దేశవ్యాప్తంగా 250 ఇన్-టచ్ శాఖలను ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక.
ఇప్పటికే 8 నగరాల్లో ఇన్-టచ్ శాఖలను ఏర్పాటు చేశామని, త్వరలోనే హైదరాబాద్‌లో కూడా ఇన్-టచ్ శాఖను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్‌బీఐ సీజీఎం హరిదయాళ్ ప్రసాద్ తెలిపారు. మొబైల్ వాలెట్‌యాప్ ‘బడ్డీ’ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగదేతర లావాదేవీలన్నీ నిర్వహించుకునే విధంగా ఇన్-టచ్ శాఖలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు రూ. 12 లక్షలతో తయారు చేసిన క్యాన్సర్ పరీక్షలు నిర్వహించే మొబైల్ వ్యాన్‌ను గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు.
ఇన్-టచ్ బ్యాంకులపై ఎస్‌బీఐ దృష్టి
Published Wed, Aug 19 2015 2:13 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM
Advertisement
Advertisement