New technology services
-
'ఫాస్టాగ్' కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు!
వాహనదారులకు ముఖ్య గమనిక. కేంద్రం ఫాస్టాగ్ వ్యవస్థకు మంగళం పాడనుంది. అవును.. ఫాస్టాగ్ కథ మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగియబోతోంది. మరి టోల్ చార్జీల వసూలు ఎలాగంటారా? అందుకోసం కొత్త పద్ధతిని ఆచరించబోతున్నట్లు సూత్రప్రాయంగా తెలియజేసింది. ఇప్పుడున్న ఫాస్టాగ్ స్థానంలో.. జీపీఎస్ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి టోల్ వసూలు చేయాలని సంబంధింత మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇప్పుటికే ఈ జీపీఎస్ టెక్నాలజీ ఆధారిత పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం, ఒక టోల్ ప్లాజా నుండి మరొక టోల్ ప్లాజాకు మొత్తం దూరానికి టోల్ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. కానీ ఈ జీపీఎస్ టెక్నాలజీతో హైవేపై వెహికల్ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందో.. దాని ఆధారంగా టోల్ చెల్లించాల్సి వస్తుంది. కేంద్రమంత్రి ప్రకటన ఈ ఏడాది మార్చిలో జరిగిన లోక్‌సభ సమావేశాల్లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలోగా దేశవ్యాప్తంగా టోల్ ప్లాజా బూత్‌లను ప్రభుత్వం తొలగించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు జీపీఎస్ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి టోల్ ఛార్జీలను వసూలు చేయనున్నట్లు చెప్పారు. కొత్త పద్దతిలో కదులుతున్న వెహికల్ జీపీఎస్ ఇమేజెస్ సాయంతో టోల్ ఛార్జీలను వసూలు చేసే సౌలభ్యం కలుగుతుందన్నారు. యూరప్ దేశాల్లో జీపీఎస్ ఆధారిత విధానం విజయవంతం కావడంతో మనదేశంలో దీనిని అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర రవాణా శాఖ జీపీఎస్ టెక్నాలజీని పరీక్షించేందుకు మనదేశంలో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కాగా, కేంద్రం ఈ కొత్త విధానాన్ని అమలు చేసే ముందు ట్రాన్స్పోర్ట్ విధానాన్ని మార్చాల్సి ఉండగా.. పైలట్ ప్రాజెక్ట్‌లో దేశవ్యాప్తంగా 1.37 లక్షల వెహికల్స్‌పై ఈ జీపీఎం వ్యవస్థను ప్రయోగించనున్నారు. ఫాస్ట్‌ట్యాగ్‌లు రద్దీ సమాయాల్లో టోల్ గేట్ల వద్ద వాహనదారులు గంటల తరబడి ఎదురు చూసే అవసరాన్ని తగ్గించేందుకు కేంద్రం 2016లో ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థని అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ బూత్‌లలో రుసుము చెల్లించడాన్ని సులభతరం చేసింది. చదవండి👉 బుడ్డోడి చేతికి స్మార్ట్ వాచ్..ఫాస్టాగ్‌తో అకౌంట్లలో మనీని దొంగిలించవచ్చా? -
భారత్‌లో తొలి 5జీ లైవ్ వీడియో కాల్
న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్ 5జీ లైవ్ వీడియో కాల్‌ను తొలిసారిగా భారత్‌లో ప్రదర్శించింది. ఇది భారత్‌లో తొలి 5జీ వీడియో కాల్ అని, క్వాల్కామ్ భాగస్వామ్యంతో దీనిని ప్రదర్శిస్తున్నామని ఎరిక్సన్ హెడ్(సౌత్ ఈస్ట్ ఏషియా, ఓషియానియా, ఇండియా) నున్‌జో మిర్టిల్లో చెప్పారు. 5జీ సర్వీస్‌లు మిల్లీమీటర్‌వేవ్(ఎమ్‌ఎమ్‌వేవ్–28 గిగాహెట్జ్, 38 గిగాహెట్జ్ స్పెక్ట్రమ్ బాండ్స్) స్పెక్ట్రమ్ ద్వారా అందుతాయని వివరించారు. 5జీ, 4జీ మొబైల్‌నెట్‌వర్క్స్‌కు ఎమ్‌ఎమ్‌వేవ్ స్పెక్ట్రమ్ కీలకమైనదని పేర్కొన్నారు. ఇక్కడ జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2019లో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి 5జీ ఫోన్లు.... ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), మెషీన్ టు మెషీన్ కమ్యూనికేషన్స్‌వంటి తాజా టెక్నాలజీలకు 5జీ కీలకం కానున్నదని మిర్టిల్లో పేర్కొన్నారు. 5జీ కారణంగా భారత్‌లో కొత్త అవకాశాలు అందివస్తాయని వివరించారు. వచ్చే ఏడాది నుంచి 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్ల అమ్మకాలు పెరగనున్నాయని క్వాల్కామ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజెన్ వగాడియా పేర్కొన్నారు. ఇంటర్నెట్ స్పీడ్ అధికంగా ఉండే 5జీ సర్వీస్‌లు భారత్‌లో ఇంకా ఆరంభం కాలేదు. ఈ సర్వీసులు ఇప్పటికే అమెరికా, దక్షిణ కొరియాల్లో లభిస్తున్నాయి. 5జీ సర్వీసులకు సంబంధించిన స్పెక్ట్రమ్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే వేలం వేయనున్నామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. -
అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత
శ్రీనగర్/జమ్మూ: పవిత్ర అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఈ ఏడాది తొలి బ్యాచ్‌గా 2,234 మంది భక్తులు ఆదివారం గట్టి భద్రత మధ్య జమ్మూకు చేరుకున్నారు. 2017లో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసినందువల్ల ఇప్పుడు బహుళ అంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రానికి వచ్చిన 300 అదనపు కంపెనీల భద్రతా దళాలనే ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు భద్రత కల్పించేందుకు కూడా వినియోగిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను కూడా వాడుకుంటున్నారు. యాత్ర సోమవారం నుంచి మొదలుకానుంది. ఈ యాత్రకు రావడానికి దేశవ్యాప్తంగా ఒకటిన్నర లక్షల మంది భక్తులు నమోదు చేసుకున్నారు. 46 రోజులపాటు ఈ యాత్ర కొనసాగుతుంది. అనంత్‌నాగ్ జిల్లాలోని 36 కిలో మీటర్ల పొడవైన పహల్గామ్ మార్గం, గండేర్బల్ జిల్లాలోని 14 కిలో మీటర్ల పొడవైన బల్తాల్ మార్గాల్లో యాత్ర సాగుతుంది. 93 వాహనాలతో కూడిన తొలి వాహన శ్రేణిని గవర్నర్ సలహాదారు కేకే శర్మ ఆదివారం జమ్మూలోని భాగవతి నగర్ బేస్ క్యాంపు వద్ద జెండా ఊపి ప్రారంభించారు. -
ఇన్-టచ్ బ్యాంకులపై ఎస్బీఐ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరికొత్త టెక్నాలజీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా యువతను ఆకర్షించే విధంగా దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా మొబైల్ వాలెట్, కొత్త యాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వచ్చే రెండేళ్ళలో దేశవ్యాప్తంగా 250 ఇన్-టచ్ శాఖలను ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. ఇప్పటికే 8 నగరాల్లో ఇన్-టచ్ శాఖలను ఏర్పాటు చేశామని, త్వరలోనే హైదరాబాద్‌లో కూడా ఇన్-టచ్ శాఖను ఏర్పాటు చేయనున్నట్లు ఎస్బీఐ సీజీఎం హరిదయాళ్ ప్రసాద్ తెలిపారు. మొబైల్ వాలెట్యాప్ ‘బడ్డీ’ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగదేతర లావాదేవీలన్నీ నిర్వహించుకునే విధంగా ఇన్-టచ్ శాఖలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు రూ. 12 లక్షలతో తయారు చేసిన క్యాన్సర్ పరీక్షలు నిర్వహించే మొబైల్ వ్యాన్‌ను గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు.