- 3,16,800 హెక్టార్లలో వివిధ పంటల సాగు
- 38,100 క్వింటాళ్ల విత్తనాలు అవసరం
- 1.70 మెట్రిక్ టన్నుల ఎరువులకు ప్రతిపాదనలు
రబీ ప్రణాళిక ఖరారు
Published Thu, Sep 22 2016 11:35 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
కరీంనగర్ అగ్రికల్చర్ : జిల్లా రబీ ప్రణాళికను వ్యవసాయశాఖ ఖరారు చేసింది. అక్టోబర్ నుంచి రబీ సీజన్ మొదలవుతుండగా.. జిల్లావ్యాప్తంగా 3,16,800 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రధానంగా పప్పుదినుసులు, ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించినప్పటికీ వరి, మెుక్కజొన్న సాగుపైనే రైతులు మెుగ్గుచూపుతారని అంచనా వేశారు. ఈ మేరకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాకు 38,100 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు, 1,70,500 మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేయాలని కోరారు. ఇప్పటికే కొన్ని రకాల విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు.
వివిధ పంటల సాగు అంచనా (హెక్టార్లలో) : వరి 22500, జొన్న 1500, సజ్జ 2వేలు, మక్క 55000, పెసర్లు 5వేలు, మినుములు 5500, కంది 400, శనగలు 1500, బబ్బెర్లు 3500, పల్లి 10వేలు, సన్‌ఫ్లవర్ 600, నువ్వులు 500.
ఎరువులు (మెట్రిక్ టన్నుల్లో) : యూరియా 77,500, డీఏపీ 15500, ఎంవోపీ 23250, కాంప్లెక్స్ 54250.
విత్తనాలు (క్వింటాళ్లలో) : పల్లి 9500, శనగలు 2300, మినుములు 300, పెసర్లు 800, కందులు 50, వరి 20వేలు, మక్కలు 5వేలు, నువ్వులు 50 క్వింటాళ్ల చొప్పున ఇప్పటికే అందుబాటులో ఉంచారు.
Advertisement
Advertisement