బహుముఖ వ్యూహం | Multy Plans to pushkra Ghats | Sakshi
Sakshi News home page

బహుముఖ వ్యూహం

Published Fri, Aug 5 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

మహబూబ్‌నగర్‌ క్రైం: కష్ణా పుష్కరాలను విజయవంతం చేస్తామని జిల్లా అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏకకాలంలో ట్రాఫిక్, భద్రతపై నిఘా పెట్టి బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తామని వెల్లడించారు. రద్దీ నియంత్రణ(క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌)కు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తులు జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి జిల్లా దాటి వెళ్లే వరకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. పుష్కరాల నిర్వహణ, వీఐపీల భద్రత, ట్రాఫిక్‌ జాం, ఘాట్లలో రద్దీ నియంత్రణ వంటి పలు అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. 
– కష్ణాపుష్కరాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు 
– ఓకే సమయంలో ట్రాఫిక్, భద్రతపై నిఘా
– హైవేపై ప్రతి 30కి.మీ.లకు ఒక హోల్డింగ్‌ పాయింట్‌ 
– భూత్పూర్‌ వద్ద భారీ జంక్షన్‌ 
– ‘సాక్షి’తో అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసులు
 
మహబూబ్‌నగర్‌ క్రైం: కష్ణా పుష్కరాలను విజయవంతం చేస్తామని జిల్లా అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏకకాలంలో ట్రాఫిక్, భద్రతపై నిఘా పెట్టి బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తామని వెల్లడించారు. రద్దీ నియంత్రణ(క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌)కు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తులు జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి జిల్లా దాటి వెళ్లే వరకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. పుష్కరాల నిర్వహణ, వీఐపీల భద్రత, ట్రాఫిక్‌ జాం, ఘాట్లలో రద్దీ నియంత్రణ వంటి పలు అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
 
 
భూత్పూర్‌ వద్ద జంక్షన్‌..
జిల్లాలో అన్నింటì కీ మధ్య ఉండే భూత్పూర్‌ చౌరస్తాలో తాత్కాలిక ఔట్‌ పోస్టుతో ఓ పెద్ద జంక్షన్‌ను ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్, రంగారెడ్డి, రాయచూర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ భూత్పూర్‌ వద్ద నిలిపి ఏ ఘాట్‌లో రద్దీ తక్కువగా ఉంటే ఆ వైపు వాహనాలను పంపిస్తాం. ఇక్కడ ఓ డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ చేస్తుంటారు.
 
7 వాచ్‌ టవర్స్‌
జిల్లాలో అతి ముఖ్యమైన 9ఘాట్ల వద్ద ఏడు భారీ వాచ్‌ టవర్స్‌ ఏర్పాటు చేయబోతున్నాం. దీని ద్వారా ఘాట్లలో జరిగే ప్రతి కదలిక పోలీసులకు తెలుస్తుంది. అలాగే వికలాంగుల కోసం ప్రత్యేక ఘాట్లు ఉంటాయి. ఇక్కడ వికలాంగులతో పాటు వద్ధులకు అవకాశం కల్పిస్తాం. 
 
గంటగంటకూ నమోదు
సరిహద్దుల నుంచి జిల్లాలోకి ప్రవేశించే వాహనాలను ఆయా ప్రాంతాల్లో హోల్డింగ్‌ చేస్తాం. హైదరాబాద్‌ వైపు నుంచే వాహనాలకు షాద్‌నగర్, బాలానగర్, భూత్పూర్‌ హోల్డింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయనున్నాం. ఇక్కడ వాహనాలు నిలిపి ఏ ఘాట్‌లో వాహనాలు, భక్తులు తక్కువగా ఉన్నారో అక్కడికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తాం. దాంతో పాటు ట్రాఫిక్‌ రీడింగ్‌ పాయింట్లను అక్కడక్కడ ఉంచుతాం. ఈ పాయింట్ల వద్ద జిల్లాలోకి ఎన్ని వాహనాలు వస్తున్నాయి అనేది నమోదు చేస్తాం. గంట గంటకూ వాహన లెక్కలు తీస్తాం.
 
 40కి.మీ. ఓ సీఐ పర్యవేక్షణ
గతేడాది గోదావరి పుష్కరాలలో ఆయా జిల్లాలో ఏర్పడిన ట్రాఫిక్‌ అంతరాయం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీన్ని దష్టిలో ఉంచుకుని ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా జిల్లాలోని హైదరాబాద్‌ రోడ్‌ వైపు, కర్నూలు రోడ్‌ వైపు, రాయచూర్‌ రోడ్‌ వైపు ఇలా తదితర రహదారుల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రతి 20కి.మీ. ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ), 40కి.మీకు ఇన్‌స్పెక్టర్‌(సీఐ)స్థాయి అధికారి వాహనాలను భద్రతను ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తారు. పుష్కరాలకు వచ్చే భక్తులు చాలా వరకు తమ సొంత వాహనాల్లోనే వస్తారని అంచనా వేస్తున్న దష్ట్యా జాతీయ రహదారులపై ట్రాఫిక్‌ నియంత్రణకు అత్యవసర సమయాల్లో టోల్‌గేట్లు ఎత్తివేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దీనిపై ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి జాతీయ రహదారుల అథారిటీ(ఎన్‌హెచ్‌ఏఐ)కి లేఖ రాశాం. దీనిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. 
 
24గంటలూ నిరంతర భద్రత..
పుష్కరాలకు దాదాపు 1.5కోట్ల నుంచి రెండున్నర కోట్ల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రధానఘాట్ల వద్ద 360డిగ్రీల కోణంలో తిరిగే 180సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్‌ రూంలో ప్రత్యక్ష ప్రసారం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పుష్కరాలకు వచ్చే భక్తులు, రాజకీయ నాయకులు, అధికారులు ఎవరైనా సరే పోలీసుశాఖ చేసే సూచనలు పాటించి సహకరించాలి. బీచుపల్లి, రంగాపూర్, అలంపూర్, సోమశిల, గొందిమళ్ల ఘాట్‌లో వీఐపీలు, సామాన్య భక్తులు పుష్కర స్నానం చేయడానికి వేర్వేరు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ప్రత్యేక యాప్‌..
పుష్కరాలలో స్నానం చేయడానికి వస్తున్న భక్తుల కోసం పోలీస్‌శాఖ నుంచి ఒక ప్రత్యేక యాప్‌ ప్రారంభించనున్నాం. భక్తుల సౌకర్యార్థం వారు ఎక్కడున్నారు. ఏ ఘాట్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంది, ఏ రహదారిలో ఎలాంటి ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంది, ఏ రహదారిలో వెళితే ఏ ఘాట్‌కు త్వరగా చేరుకునే అవకాశం ఉంది.. తదితర వివరాలతో జిల్లా యంత్రాంగంతో కలిసి ప్రత్యేక ఆండ్రాయిడ్‌ యాప్‌ను తీసుకొస్తున్నాం. పుష్కరాలకు రైల్వేల ద్వారా ఎక్కువమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా మహబూబ్‌నగర్, కొత్తూరు, గద్వాల, అలంపూర్‌ తదితర రైల్వే పోలీసులతో కలిసి పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు చేస్తున్నాం. 
 
 
  
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement