pushkaraghats
-
‘జన’తరంగిణి
· అన్ని పుష్కరఘాట్లలో భక్తుల సందడి · సంగమేశ్వరం, నెహ్రూనగర్‌లో కొనసాగిన రద్దీ · శనివారం జిల్లా వ్యాప్తంగా 1,28,205 భక్తుల పుష్కర స్నానాలు శ్రీశైలం : కృష్ణవేణీ నమస్తుభ్యం సర్వపాపప్రక్షాళిని ! త్రిలోకే పావన జలే రంగత్తుంగ తరంగిణి !! అంటూ సకల పాపాలను హరించి ముల్లోకాలను పావనం చేసే జలాలను కలిగి అందమైన అలలతో నాట్యమాడే కష్ణవేణీమాతకు నమస్కారం చేస్తూ భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంతో శనివారం పుష్కర స్నానాలను చేసుకున్నారు. పుష్కరాల్లో తొమ్మిదో రోజు శనివారం.. అన్ని పుష్కర ఘాట్లలో భక్తి రద్దీ కనిపించింది. శ్రీశైలంలోని పాతాళగంగ, లింగాలగట్టు, సంగమేశ్వరం, ముచ్చుమర్రి, నెహ్రూనగర్ తదితర అన్ని ఘాట్లు భక్తులతో కళకళలాడుతూ కనిపించాయి. వేకువజామున 4గంటల తరువాత ప్రారంభమైన భక్తులరద్దీ మధ్యాహ్నం ఒంటి గంట తరువాత మందగించింది. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో చాలా మంది భక్తులు మధ్యాహ్నం 12గంటల్లోగానే పుష్కర స్నానాలు ముగించుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట తరువాత అన్ని ఘాట్ల వద్ద రద్దీ తగ్గి ఆ తరువాత సాయంత్రం వేళ 5.30గంటల నుంచి 7గంటల వరకు సాధారణస్థాయిలో ఉంటుంది. శ్రీశైలంలో జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ రవికృష్ణ, ఆర్డీఓ రఘుబాబులు పాతాళగంS, లింగాలగట్టుఘాట్లను సందర్శించి ఏర్పాట్లను. లింగాలగట్టు వద్ద యర్రగొండపాలెం ఎంఎల్ఏ డేవిడ్ రాజు పుష్కరస్నానాలు ఆచరించుకున్నారు. శనివారం రాత్రి 8గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా 1,28,205 మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించుకున్నట్లు అధికారుల అంచనా. రెండుగంటల పాటు భ్రమరాంబ ఘాట్ మూసివేత పాతాళగంగ వద్ద కొత్తగా నిర్మించిన భ్రమరాంబ పుష్కర ఘాట్‌ను సుమారు రెండు గంటల పాటు జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆదేశాల మేరకు మూసివేశారు. శుక్రవారం రాత్రి ఆ ఘాట్‌కు సమీపంలో ఉన్న కొండ చరియల నుంచి రాళ్లు జారిపడడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో విరిగిపడ్డ కొండచరియల రాళ్లు తిరిగి పడకుండా ఐరన్ మెష్ఏర్పాటు చేసి హైటెన్షన్ ఎలక్ట్రిక్ వైర్ ద్వారా దిగ్బంధం చేసే ప్రక్రియ సగం వరకు కొనసాగింది. ఆ మిగిలిన సగం భాగం నుంచే రాళ్లు పడడంతో రెండు గంటల పాటు ఘాట్ మూసివే సి పూర్తిస్థాయిలో కొండ చర్యలు విరిగిపడకుండా హైటెన్షన్ వైర్లను వినియోగించి మిగిలిన పని పూర్తి చేశాక తిరిగి భక్తులను ఆ మార్గం ద్వారా అనుమతించారు. దీంతో మల్లికార్జునఘాట్కు భక్తుల తాకిడి పెరిగింది. అయితే అక్కడి నుంచి పిండప్రదానం మార్గం ద్వారా భక్తులు వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సివచ్చింది. మొదట నాపరాళ్లు వేసి ఆ తరువాత వెట్మిక్స్ర్ వేసి మళ్లీ అది గుంతలు పడడంతో తిరిగి దానిపై నాపరాళ్లను వేయడం ప్రారంభించారు. దీంతో భక్తులు బ్రమరాంబా ఘాట్ నుంచి పిండప్రదానం స్టేజీ మీదుగా వెళ్లడానికి నానా కష్టాలు పడ్డారు. -
కృష్ణాతీరం..ఆనందగీతం
-
సింధునాదం.. కృష్ణగానం
8వ రోజు జిల్లాలో 98వేలకు పైగా భక్తులు – శ్రీశైలం ఆలయ పోస్టల్ కవర్ ఆవిష్కరణ – అన్ని ఘాట్లలో మధ్యాహ్నం నుంచి రద్దీ సాధారణం – 21న సీఎం చంద్రబాబు శ్రీశైలం రాక – భద్రతా ఏర్పాట్లపై అధికారుల సమీక్ష శ్రీశైలం: కృష్ణా పుష్కరాల్లో భాగంగా 8వ రోజు శుక్రవారం జిల్లాలోని పుష్కర ఘాట్లన్నీ భక్తులతో కిక్కిరిశాయి. అయితే మధ్యాహ్నానికి పరిస్థితి మారిపోయింది. ఎండ వేడిమి నేపథ్యంలో ఘాట్లలో భక్తుల రద్దీ పలుచబడింది. శ్రీశైలంలోని పాతాళగంగ, లింగాలగట్టు, సంగమేశ్వరం, ముచ్చుమర్రి, నెహ్రూనగర్ ఘాట్లలో మొత్తం 97,025 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా. ఇదిలాఉంటే పుష్కరాలు ఈనెల 23న ముగుస్తుండటంతో 21వ తేదీన శ్రీశైలానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులతో పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్ల వద్ద ఎలాంటి అసౌకర్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పాతాళగంగ ఘాట్ రోడ్డు గుంతలమయంగా ఉందని.. సీసీ రోడ్డు వేయాలని దేవస్థానం ఈఓ భరత్‌గుప్తకు సూచించారు. భద్రతా ఏర్పాట్లపై విస్తత స్థాయి సమీక్ష సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ విజయమోహన్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారి డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికృష్ణ, దేవస్థానం ఈఓ భరత్ గుప్తలతో కలిసి భద్రతా ఏర్పాట్లపై సమీక్షా నిర్వహించారు. ఆలయ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఆక్టోపస్, ఇంటెలిజెన్స్, ఎస్బీ, ఐబీ, ఫైర్, దేవస్థానం, రెవెన్యూ అధికారులతో చర్చించారు. శ్రీశైలంలోని ముఖద్వారం, దోర్నాల, సున్నిపెంటలలో వెహికిల్ స్కానర్లు, బ్యాగ్ స్కానర్లను ఏర్పాటు చేయాలని.. కష్ణానదిలో బోట్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఔట్‌పోస్టుకు ముఖమైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. ఆధార్, ఫొటోగ్రాఫ్ ఐడీ కార్డుల ఆధారంగా వసతి, దర్శనాలు కొనసాగించాలన్నారు. భక్తులకు డ్రస్ కోడ్ తప్పనిసరి చేయాలని.. ఆలయంలో నాలుగు వైపులా వాచ్ టవర్ల నిర్మాణం చేపట్టాలన్నారు. శ్రీశైలానికి.. ఆలయానికి పదే పదే వచ్చే వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. -
పుష్కరాలకు పటిష్ట బందోబస్తు
మక్తల్ : ఈ నెల 12నుంచి జరిగే కష్ణా పుష్కరాలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని నారాయణపేట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మక్తల్‌లో మంగళవారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. పుష్కరాలకు పోలీస్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని మాగనూర్, మక్తల్ మండాలల్లో జరిగే పుష్కరాలకు ఒక ఏఎస్పీ, 5మంది డీఎస్పీలు, 17మంది సీఐలు, 89మంది ఎస్ఐలు, 850మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధాన కూడళీ వద్ద సీసీ కెమెరాలు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. మక్తల్ మండలానికి ముగ్గురు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, 45మంది ఎస్ఐలు, 425మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో సీఐ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. పుష్కరఘాట్ల వద్ద ముమ్మర ఏర్పాట్లు ఆత్మకూర్ : కష్ణా పుష్కరాలను పురస్కరించుకొని ఆత్మకూర్ మండల పరిధిలోని జూరాల ప్రాజెక్టు నందిమల్ల డ్యాం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపడుతున్నామని సీఐ ప్రబాకర్‌రెడ్డి తెలిపారు. నందిమల్ల ఘాట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడ ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, 14మంది ఎస్ఐలు, 172మంది పోలీసులు సేవలందిస్తారన్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడకు వచ్చే భక్తుల క్షేమం కోసం 32సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ఇక్కడ పనులపై ఆరా తీశారు. ఇక్కడకు వచ్చే భక్తులకోసం దేవరకద్ర నుంచి లాల్కోట, చిన్నచింతకుంట, మద్దూర్, అమరచింత, మస్తీపూర్ మీదుగా జూరాల డ్యాం చేరుకోవాల్సి ఉంటుందని అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు తిరిగి మూలమళ్ల నుంచి మస్తీపూర్, అమరచింత, మరికల్ మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. కొత్తకోట నుంచి వచ్చేవారు మదనాపురం, రామన్‌పాడు, పీజేపీ క్యాంప్ నుంచి జూరాల ఘాట్‌కు చేరుకోవాలని, అక్కడి నుంచి తిప్డంపల్లి మీదుగా అప్పరాల నుంచి హైవేకు చేరుకోవాలని సూచించారు. మాగనూర్‌కు చేరిన 600 మంది పోలీసులు మాగనూర్ : మండలంలోని కష్ణా, వాసునగర్, తంగిడి, ముడుమాల్ ఘాట్లల్లో వి««దlులు నిర్వహించేందుకు మంగళవారం సాయంత్రం 600 మంది పోలీసులు కష్ణకు చేరుకున్నారు. వారికి కష్ణలోని గోదాం, గుడెబల్లూర్లోని మేరిమెమోరియల్ పాఠశాల, నల్లగట్టు వద్ద ఉన్న కస్తూర్బా ఆశ్రమ పాఠశాలల్లో వసతి కల్పించారు. రేపటి నుంచి ఘాట్లు అన్ని కూడా పోలీసుల ఆధీనంలోకి వెళ్లనున్నాయి. -
బహుముఖ వ్యూహం
మహబూబ్‌నగర్ క్రైం: కష్ణా పుష్కరాలను విజయవంతం చేస్తామని జిల్లా అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏకకాలంలో ట్రాఫిక్, భద్రతపై నిఘా పెట్టి బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తామని వెల్లడించారు. రద్దీ నియంత్రణ(క్రౌడ్ మేనేజ్మెంట్)కు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తులు జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి జిల్లా దాటి వెళ్లే వరకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. పుష్కరాల నిర్వహణ, వీఐపీల భద్రత, ట్రాఫిక్ జాం, ఘాట్లలో రద్దీ నియంత్రణ వంటి పలు అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. – కష్ణాపుష్కరాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు – ఓకే సమయంలో ట్రాఫిక్, భద్రతపై నిఘా – హైవేపై ప్రతి 30కి.మీ.లకు ఒక హోల్డింగ్ పాయింట్ – భూత్పూర్ వద్ద భారీ జంక్షన్ – ‘సాక్షి’తో అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసులు మహబూబ్‌నగర్ క్రైం: కష్ణా పుష్కరాలను విజయవంతం చేస్తామని జిల్లా అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏకకాలంలో ట్రాఫిక్, భద్రతపై నిఘా పెట్టి బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తామని వెల్లడించారు. రద్దీ నియంత్రణ(క్రౌడ్ మేనేజ్మెంట్)కు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తులు జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి జిల్లా దాటి వెళ్లే వరకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. పుష్కరాల నిర్వహణ, వీఐపీల భద్రత, ట్రాఫిక్ జాం, ఘాట్లలో రద్దీ నియంత్రణ వంటి పలు అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. భూత్పూర్ వద్ద జంక్షన్.. జిల్లాలో అన్నింటì కీ మధ్య ఉండే భూత్పూర్ చౌరస్తాలో తాత్కాలిక ఔట్ పోస్టుతో ఓ పెద్ద జంక్షన్‌ను ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్, రంగారెడ్డి, రాయచూర్ వైపు నుంచి వచ్చే వాహనాలన్నింటినీ భూత్పూర్ వద్ద నిలిపి ఏ ఘాట్‌లో రద్దీ తక్కువగా ఉంటే ఆ వైపు వాహనాలను పంపిస్తాం. ఇక్కడ ఓ డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ చేస్తుంటారు. 7 వాచ్ టవర్స్ జిల్లాలో అతి ముఖ్యమైన 9ఘాట్ల వద్ద ఏడు భారీ వాచ్ టవర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. దీని ద్వారా ఘాట్లలో జరిగే ప్రతి కదలిక పోలీసులకు తెలుస్తుంది. అలాగే వికలాంగుల కోసం ప్రత్యేక ఘాట్లు ఉంటాయి. ఇక్కడ వికలాంగులతో పాటు వద్ధులకు అవకాశం కల్పిస్తాం. గంటగంటకూ నమోదు సరిహద్దుల నుంచి జిల్లాలోకి ప్రవేశించే వాహనాలను ఆయా ప్రాంతాల్లో హోల్డింగ్ చేస్తాం. హైదరాబాద్ వైపు నుంచే వాహనాలకు షాద్‌నగర్, బాలానగర్, భూత్పూర్ హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నాం. ఇక్కడ వాహనాలు నిలిపి ఏ ఘాట్‌లో వాహనాలు, భక్తులు తక్కువగా ఉన్నారో అక్కడికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తాం. దాంతో పాటు ట్రాఫిక్ రీడింగ్ పాయింట్లను అక్కడక్కడ ఉంచుతాం. ఈ పాయింట్ల వద్ద జిల్లాలోకి ఎన్ని వాహనాలు వస్తున్నాయి అనేది నమోదు చేస్తాం. గంట గంటకూ వాహన లెక్కలు తీస్తాం. 40కి.మీ. ఓ సీఐ పర్యవేక్షణ గతేడాది గోదావరి పుష్కరాలలో ఆయా జిల్లాలో ఏర్పడిన ట్రాఫిక్ అంతరాయం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీన్ని దష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ అంతరాయం లేకుండా జిల్లాలోని హైదరాబాద్ రోడ్ వైపు, కర్నూలు రోడ్ వైపు, రాయచూర్ రోడ్ వైపు ఇలా తదితర రహదారుల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి 20కి.మీ. ఒక సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ), 40కి.మీకు ఇన్స్పెక్టర్(సీఐ)స్థాయి అధికారి వాహనాలను భద్రతను ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తారు. పుష్కరాలకు వచ్చే భక్తులు చాలా వరకు తమ సొంత వాహనాల్లోనే వస్తారని అంచనా వేస్తున్న దష్ట్యా జాతీయ రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు అత్యవసర సమయాల్లో టోల్గేట్లు ఎత్తివేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దీనిపై ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి జాతీయ రహదారుల అథారిటీ(ఎన్హెచ్ఏఐ)కి లేఖ రాశాం. దీనిపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. 24గంటలూ నిరంతర భద్రత.. పుష్కరాలకు దాదాపు 1.5కోట్ల నుంచి రెండున్నర కోట్ల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రధానఘాట్ల వద్ద 360డిగ్రీల కోణంలో తిరిగే 180సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూంలో ప్రత్యక్ష ప్రసారం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పుష్కరాలకు వచ్చే భక్తులు, రాజకీయ నాయకులు, అధికారులు ఎవరైనా సరే పోలీసుశాఖ చేసే సూచనలు పాటించి సహకరించాలి. బీచుపల్లి, రంగాపూర్, అలంపూర్, సోమశిల, గొందిమళ్ల ఘాట్‌లో వీఐపీలు, సామాన్య భక్తులు పుష్కర స్నానం చేయడానికి వేర్వేరు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక యాప్.. పుష్కరాలలో స్నానం చేయడానికి వస్తున్న భక్తుల కోసం పోలీస్‌శాఖ నుంచి ఒక ప్రత్యేక యాప్ ప్రారంభించనున్నాం. భక్తుల సౌకర్యార్థం వారు ఎక్కడున్నారు. ఏ ఘాట్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంది, ఏ రహదారిలో ఎలాంటి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఏ రహదారిలో వెళితే ఏ ఘాట్‌కు త్వరగా చేరుకునే అవకాశం ఉంది.. తదితర వివరాలతో జిల్లా యంత్రాంగంతో కలిసి ప్రత్యేక ఆండ్రాయిడ్ యాప్‌ను తీసుకొస్తున్నాం. పుష్కరాలకు రైల్వేల ద్వారా ఎక్కువమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా మహబూబ్‌నగర్, కొత్తూరు, గద్వాల, అలంపూర్ తదితర రైల్వే పోలీసులతో కలిసి పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు చేస్తున్నాం. -
పుష్కరఘాట్ పనుల పరిశీలన
ధరూరు : మండలంలోని పెద్దచింతరేవుల పుష్కర ఘాట్‌ను ఆదివారం ఎండోన్మెంట్ డీఈ మైపాల్ సందర్శించారు. గతంలో ఉన్న ఘాట్‌తోపాటు నూతనంగా నిర్మిస్తున్న ఘాట్లను, అక్కడే నిర్మిస్తున్న స్నానపు గదులు, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. సమయం దగ్గరపడుతోందని పనులు త్వరగా పూర్తి చేయాలని, భక్తుల రద్దీని దష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ఏర్పాట్లను చేయాలని సూచించారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఆలయ ధర్మకర్త గిరిరావు, ఈఓ రామన్‌గౌడ్ తదితరులున్నారు. -
ఘాట్లవద్ద పటిష్ట బందోబస్తు
ఆత్మకూర్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా ఘాట్ల వద్ద ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తుల సౌకర్యార్థం 1500ల మంది పోలీసులతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. గురువారం మూలమళ్ల, జూరాల పుష్కరఘాట్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గద్వాల డివిజన్ పరిధిలోని బీచుపల్లిలో పెద్ద ఘాట్ ఉందని అక్కడ ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 55మంది సీఐలు, 150మంది ఎస్ఐలు, వెయ్యి మంది పోలీసులు సేవలందిస్తారన్నారు. జూరాల ప్రాజెక్టు నందిమల్ల పుష్కరఘాట్ వద్ద ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, 12మంది ఎస్ఐలు, 150మంది పోలీసులు విధులు నిర్వహిస్తారన్నారు. మిగతా ఘాట్లలో ఒక సీఐ, నలుగురు ఎస్ఐలు, 40మంది కానిస్టేబుళ్లు ఉంటారని అన్నారు. అన్ని ఘాట్ల వద్ద సీసీ కెమెరాలు, హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆగస్టు 15నుంచి ఘాట్లను ఆధీనంలోకి తీసుకొని అక్కడ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తామన్నారు. ఇక్కడకు వచ్చే భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంతోషంగా తిరిగి వెళ్లే విధంగా ముందుకు వెళుతున్నామని అందులో భాగంగా హైదరాబాద్ నుంచి ఇక్కడకు వచ్చే భక్తులకు రూట్‌మ్యాప్ తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టామన్నారు. శంషాబాద్ నుంచి మొదలుకొని భక్తులకు సుముఖ మార్గాలు తెలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో గద్వాల డీఎస్పీ బాలకోటి, సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎస్ఐ సీహెచ్ రాజు, తహసీల్దార్ ప్రేమ్‌రాజ్, ఆర్ఐ అజయ్‌కుమార్‌రెడ్డి, వీఆర్ఓలు యుగందర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
పుష్కరఘాట్లను పరిశీలించిన ఎస్పీ
ఇటిక్యాల /గద్వాలన్యూటౌన్/ఆత్మకూర్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్ల నిర్మాణాలను ఆదివారం ఎస్పీ రెమా రాజేశ్వరి పరిశీలించారు. ఆలయాల పరిసరాలను, పుష్కరాల సందర్భంగా వీఐపీ వాహనాల పార్కింగ్, వీఐపీ పుష్కరఘాట్లను పరిశీలించారు. బీచుపల్లి పుణ్యక్షేత్రం పరిసరాలలో, కృష్ణానది అవతల రంగాపురం నుంచి ఇటిక్యాల మండలం ఎర్రవల్లిచౌరస్తా వరకు జాతీయ రహదారి వెంబడి పటిష్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలని స్థానిక డీఎస్పీ బాలకోటి, అలంపూర్ సీఐ వెంకటేశ్వర్లు, ఇటిక్యాల ఎస్ఐ సురేష్‌కు సూచించారు. పుష్కరాల సందర్భంగా బీచుపల్లి పుణ్యక్షేత్రానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, భద్రత విషయంలో రాజీ పడవద్ద చెప్పారు. వీఐపి వాహన పార్కింగ్ స్థలాల వద్ద, భక్తుల పార్కింగ్ స్థలాల వద్ద విద్యుత్ బల్బులు, సీసి కెమెరాల ఏర్పాటు పనులు త్వరగా పూర్తిచేసేలా చూడాలని ఆదేశించారు. రోడ్డుమార్గాల మ్యాప్‌లతో అధికారులతో చర్చ అనంతరం గద్వాలరూరల్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. అనంతరం గద్వాల ప్రాంతంలోని పుష్కరఘాట్ల రోడ్డు మార్గాలపై అధికారులతో చర్చించారు. కర్నూలు నుంచి బస్సుమార్గం ద్వారా వచ్చే భక్తులు గద్వాల మండల పరిధిలోని బీరెల్లి పుష్కరఘాట్‌కు వెళ్లే మార్గాన్ని, రైలుమార్గం ద్వారా కర్నూలువైపు నుంచి నదీఅగ్రహారం పుష్కరఘాట్‌కు వెళ్లే రోడ్డు మార్గాలను మ్యాప్‌ల ద్వారా సీఐ సురేష్ వివరించారు. తర్వాత నది అగ్రహారం పుష్కరఘాట్‌ను సందర్శించారు. అక్కడి పనుల పురోగతి గురించి ఎస్పీ తెలుసుకున్నారు. షాద్‌నగర్ ఏఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్, గద్వాల డీఎస్పీ బాలకోటి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్, పలువురు ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు. నందిమల్ల పుష్కరఘాట్‌ను సందర్శన అక్కడి నుంచి ఆత్మకూర్ మండలంలోని నందిమల్ల పుష్కరఘాట్‌ను ఎస్పీ సందర్శించారు. ఏర్పాట్ల గురించి అధికారులతో అడిగి తెలుసుకున్నారు. జూరాల ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో తదితర వివరాల గురించి ఆరా తీశారు. ఘాట్ల వద్ద ప్రత్యేక సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు పెద్దఎత్తున పోలీసుబలగాలను మోహరించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్ఐ సీహెచ్ రాజు, ఏపీఎం శ్రీనివాసులు, సర్పంచ్ రంగమ్మ, ఎంపీటీసీ లక్ష్మమ్మ, కాంట్రాక్టర్లు ప్రతాప్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మస్తీపూర్ శ్రీను, సర్వేయర్ బాస్కర్ ఉన్నారు.