పుష్కరాలకు పటిష్ట బందోబస్తు
Published Tue, Aug 9 2016 11:00 PM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
మక్తల్ : ఈ నెల 12నుంచి జరిగే కష్ణా పుష్కరాలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని నారాయణపేట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మక్తల్‌లో మంగళవారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. పుష్కరాలకు పోలీస్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని మాగనూర్, మక్తల్ మండాలల్లో జరిగే పుష్కరాలకు ఒక ఏఎస్‌పీ, 5మంది డీఎస్పీలు, 17మంది సీఐలు, 89మంది ఎస్‌ఐలు, 850మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధాన కూడళీ వద్ద సీసీ కెమెరాలు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. మక్తల్ మండలానికి ముగ్గురు డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, 45మంది ఎస్‌ఐలు, 425మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో సీఐ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
పుష్కరఘాట్ల వద్ద ముమ్మర ఏర్పాట్లు
ఆత్మకూర్ : కష్ణా పుష్కరాలను పురస్కరించుకొని ఆత్మకూర్ మండల పరిధిలోని జూరాల ప్రాజెక్టు నందిమల్ల డ్యాం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపడుతున్నామని సీఐ ప్రబాకర్‌రెడ్డి తెలిపారు. నందిమల్ల ఘాట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడ ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, 14మంది ఎస్‌ఐలు, 172మంది పోలీసులు సేవలందిస్తారన్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడకు వచ్చే భక్తుల క్షేమం కోసం 32సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ఇక్కడ పనులపై ఆరా తీశారు. ఇక్కడకు వచ్చే భక్తులకోసం దేవరకద్ర నుంచి లాల్‌కోట, చిన్నచింతకుంట, మద్దూర్, అమరచింత, మస్తీపూర్ మీదుగా జూరాల డ్యాం చేరుకోవాల్సి ఉంటుందని అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు తిరిగి మూలమళ్ల నుంచి మస్తీపూర్, అమరచింత, మరికల్ మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. కొత్తకోట నుంచి వచ్చేవారు మదనాపురం, రామన్‌పాడు, పీజేపీ క్యాంప్ నుంచి జూరాల ఘాట్‌కు చేరుకోవాలని, అక్కడి నుంచి తిప్డంపల్లి మీదుగా అప్పరాల నుంచి హైవేకు చేరుకోవాలని సూచించారు.
మాగనూర్‌కు చేరిన 600 మంది పోలీసులు
మాగనూర్ : మండలంలోని కష్ణా, వాసునగర్, తంగిడి, ముడుమాల్ ఘాట్లల్లో వి««దlులు నిర్వహించేందుకు మంగళవారం సాయంత్రం 600 మంది పోలీసులు కష్ణకు చేరుకున్నారు. వారికి కష్ణలోని గోదాం, గుడెబల్లూర్‌లోని మేరిమెమోరియల్ పాఠశాల, నల్లగట్టు వద్ద ఉన్న కస్తూర్బా ఆశ్రమ పాఠశాలల్లో వసతి కల్పించారు. రేపటి నుంచి ఘాట్లు అన్ని కూడా పోలీసుల ఆధీనంలోకి వెళ్లనున్నాయి.
Advertisement
Advertisement