హైదరాబాద్: విద్యా ప్రమాణాలు పెంచేందుకు విద్యార్థి సంఘాలు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కె.నాగేశ్వర్ అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలపై బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సీపీఐ నేత గుండా మల్లేష్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని ఆర్భాటంగా ప్రకటించి కిమ్మనకపోవటం విచారకరమన్నారు. వివిధ విద్యార్థి సంఘాల నేతలు బి.సాంబశివ, గౌతం ప్రసాద్, స్టాలిన్, నాగేశ్వర్, తేజ, మహేష్ పాల్గొన్నారు.